IND vs IRE: అరుదైన ఘనత సాధించిన అర్ష్‌దీప్.. చాహల్‌ని అధిగమించి ఆ లిస్టులో రెండో భారతీయుడిగా..

| Edited By: Ram Naramaneni

Aug 21, 2023 | 8:16 AM

IND vs IRE 2nd T20I: రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్ తరఫున 72 పరుగులతో మెరుగ్గా రాణిస్తున్న ఆండ్రూ బల్బిర్నీని అర్ష్‌దీప్ పెవిలియన్ చేర్చాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 50వ వికెట్‌ను పడగొట్టాడు. అయితే యుజ్వేంద్ర చాహల్ 34 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీయగా.. ఈ మైలురాయిని చేరుకోవడం కోసం అర్ష్‌దీప్ 33 ఇన్నింగ్స్‌ మాత్రమే తీసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత వేగంగా 50 టీ20 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా..

IND vs IRE: అరుదైన ఘనత సాధించిన అర్ష్‌దీప్.. చాహల్‌ని అధిగమించి ఆ లిస్టులో రెండో భారతీయుడిగా..
Arshdeep Singh And Yuzvendra Chahal
Follow us on

IND vs IRE 2nd T20I: ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకముందు జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా టీమిండియానే విజయం సాధించడంతో.. టీ20 సిరీస్‌ని భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌ ద్వారా తొలి సారి బ్యాటింగ్ చేసి 21 బంతుల్లో 38 పరుగులు చేసిన రింకూ సింగ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. అయితే ఇదే మ్యాచ్‌లో కేలవం ఒక్క వికెట్ తీసిన ఆర్ష్‌దీప్ ఓ అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. అంతేకాక యుజ్వేంద్ర చాహల్ కంటే ఆ మైలు రాయిని చేరుకుని, ఆ ఘనత సాధించిన రెండో ఫాస్టెస్ట్ బౌలర్‌గా అవతరించాడు. ఇంతకీ ఆర్ష్‌దీప్ ఏం చేశాడంటే..

రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్ తరఫున 72 పరుగులతో మెరుగ్గా రాణిస్తున్న ఆండ్రూ బల్బిర్నీని అర్ష్‌దీప్ పెవిలియన్ చేర్చాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 50వ వికెట్‌ను పడగొట్టాడు. అయితే యుజ్వేంద్ర చాహల్ 34 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీయగా.. ఈ మైలురాయిని చేరుకోవడం కోసం అర్ష్‌దీప్ 33 ఇన్నింగ్స్‌ మాత్రమే తీసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత వేగంగా 50 టీ20 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. ఇక ఆర్ష్‌దీప్ కంటే ముందు ఈ లిస్టులో 29 ఇన్నింగ్స్‌ల్లోనే 50 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్ ఉన్నాడు.  మరోవైపు వేగంగా 50 వికెట్లు తీసిన టీమిండియా ఫాస్ట్ బౌలర్‌గా కూడా అర్ష్‌దీప్ అవతరించాడు.

ఇవి కూడా చదవండి

‘హాఫ్ సెంచరీ’ వికెట్లు..

వేగవంతమైన రెండో బౌలర్..


వేగంగా 50 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్..

భారత్ ఖాతాలో మరో సిరీస్..

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్..

కాగా, ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంకా మిగిలి ఉన్న మూడో టీ20 మ్యాచ్‌.. ఆగస్టు 23న అంటే బుధవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.