IND vs ENG: ‘ఏంటబ్బాయ్‌ ఇది’.. అందివచ్చిన అవకాశాలను చేజేతులా వృథా చేసుకుంటోన్న తెలుగు క్రికెటర్‌.. వేటు తప్పదా?

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న యువ వికెట్ కీపర్, బ్యాటర్‌ కేఎస్ భరత్ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. అటు కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తాచాటలేకపోతున్నాడు

IND vs ENG: ఏంటబ్బాయ్‌ ఇది.. అందివచ్చిన  అవకాశాలను చేజేతులా వృథా చేసుకుంటోన్న తెలుగు క్రికెటర్‌.. వేటు తప్పదా?
KS Bharat

Updated on: Feb 04, 2024 | 9:04 PM

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న యువ వికెట్ కీపర్, బ్యాటర్‌ కేఎస్ భరత్ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. అటు కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తాచాటలేకపోతున్నాడు. దీంతో మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో ఈ తెలుగు క్రికెటర్‌పై వేటు పడనుందని తెలుస్తోంది. బ్యాటింగ్‌ సంగతి పక్కన పెడితే.. ఈ సిరీస్‌కు ముందు వికెట్‌ కీపింగ్‌ విషయంలో భరత్‌ పై మంచి అభిప్రాయమే ఉంది. అయితే ఇంగ్లండ్‌ తో సిరీస్‌లో భరత్ కొన్ని సులువైన స్టంపింగ్ అవకాశాలను వృథా చేశాడు. అలాగే వికెట్ వెనుక బైల రూపంలో భారీగా పరుగులిచ్చాడు. బ్యాటింగ్‌లోనూ భరత్‌ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. భారత టెస్టు జట్టులో ఇప్పటి వరకు 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భరత్ 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 20 సగటుతో 221 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 44 పరుగులు మాత్రమే.

రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడం, KL రాహుల్ గాయపడడంతో టీమ్ ఇండియాలో వికెట్ కీపర్ స్థానాన్ని కేఎస్‌ భరత్‌తో భర్తీ చేయాలని సెలెక్టర్లు భావించారు. కానీ అతను ఒక్క మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేయలేదు కదా ఒక్క విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. దీంతో ఈ తెలుగు ప్లేయర్‌పై సెలక్టర్లు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. వరుస వైఫల్యాలు చవిచూస్తున్న అతనిని మూడో టెస్టు మ్యాచ్ నుంచి తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. భరత్‌కు బదులుగా జట్టులోకి ఎంపికైన మరో వికెట్ కీపర్ బ్యాటర్‌ ధ్రువ్ జురెల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌ తో సిరీస్‌లో 4 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన భరత్‌ వరుసగా 41, 28, 17, 6 పరుగులు చేశాడు. హైదరాబాద్‌ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కీలక దశలో వికెట్ సమర్పించి టీమిండియా ఓటమికి కారణమయ్యాడన్న విమర్శలను మూట గట్టుకన్నాడు. అందువల్ల మూడో టెస్టులో భరత్ ఆడడం అనుమానమే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..