IND vs ENG: లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ టీంల మధ్య టెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ జరుగుతోంది. ఆదివారం మ్యాచ్‌లో నాలుగో రోజు కొన్ని ఫొటోలు, వీడియోలు వేడిని పెంచేశాయి. ఒకవైపు భారత బ్యాట్స్‌మెన్ మైదానంలో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొంటుండగా, మరోవైపు బాల్కనీలో కెప్టెన్ విరాట్ కోహ్లీ తోటి ఆటగాళ్లతో సరదాగా గడిపాడు. విరాట్ కోహ్లీ నాల్గవ రోజు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, మయాంక్ అగర్వాల్‌తో సహా జట్టులోని కొంతమంది సభ్యులతో కలిసి లార్డ్స్ గ్రౌండ్ బాల్కనీలో కూర్చున్నాడు. ఈ సమయంలో కోహ్లీ ప్రవర్తనను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమిండియా కెప్టెన్ నాగినీ డ్యా్న్స్ చేస్తున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది.
విరాట్ కోహ్లీ డ్యాన్స్.. సౌరవ్ గంగూలీని గుర్తుంచుకుంటోన్న ఫ్యాన్స్
విరాట్ కోహ్లీ లార్డ్స్ బాల్కనీలో నాగినీ డ్యాన్స్ భంగిమలో కనిపించడంతో ఆయన అభిమానులు టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని లార్డ్స్‌లో చేసిన హంగామాను గుర్తుచేసుకుంటున్నారు. నాట్‌వెస్ట్ ట్రోఫీలో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, గంగూలీ చొక్కా విప్పి గిర గిరా తిప్పుతూ సందడి చేశాడు. అయితే మరికొంతమంది మాత్రం ఈ ఉత్సాహం పరుగులు చేయడంలో చూపించాలంటూ కోహ్లీపై సెటైర్లు వేస్తున్నారు. కాగా, కోహ్లీ డాన్స్ చేస్తు్న్న సమయంలో తోటి ఆటగాళ్లు అతన్ని చూసి నవ్వుతూ కనిపించారు.
భారమంతా టీమిండియా కీపర్ పంత్ పైనే..
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన రాహుల్(5) త్వరగానే పెవిలియన్ చేరాడు. రోహిత్ కొద్దిసేపు అలరించినా భారీ షాట్‌కు ప్రయత్నించి 21 పరుగుల వద్ద ఔటయ్యాడు. కోహ్లీ(20) మరోసారి నిరాశ పరిచాడు. అయితే పుజారా(45)-రహానె(61) జోడీ శతక భాగస్వామ్యంతో టీమిండియా తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. నేడు భారమంతా పంత్(14 నాటౌట్) పైనే ఉంది. దీంతో టీమిండియా కనీసం 200 పరుగులైనా ఆధిక్యం సాధింస్తుందో లేదో చూడాలి. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు, అలీ 2, సామ్ కరన్ 1 వికెట్ పడగొట్టారు.
Captain’s at Lord’s Balcony. What a fall !
2002. 2021 pic.twitter.com/NtqD22cmW6
— रितिक (@OpeakyP) August 13, 2021
Kohli doing naagin dance or what ? pic.twitter.com/H9ts7yMwfK
— Ríyu (@peachworld26) August 13, 2021
Also Read:
లక్ష్యం 78.. కానీ, 19 పరుగులకే ఆలౌట్.. 5గురు బ్యాట్స్‌మెన్స్ జీరోకే పెవిలియన్.. ఎక్కడో తెలుసా?