IND vs ENG: ప్రపంచ కప్ 2023 తర్వాత టీమిండియా అతిపెద్ద పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. జనవరి 25, 2024 నుంచి, భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ టెస్ట్ సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-2025లో భాగంగా ఉంటుంది. ఇందులో హైదరాబాద్ (జనవరి 25 నుంచి 29 వరకు)లో తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అనంతరం విశాఖపట్నం (ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు) రెండ్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దీంతో తెలుగు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందినట్లైంది. అంటే తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లు తెలుగు రాష్ట్రాల్లోనే జరగనున్నాయి. ఇక మూడో టెస్ట్ మ్యాచ్ రాజ్‌కోట్ (ఫిబ్రవరి 15-19)లో, నాలుగో టెస్ట్ మ్యాచ్ రాంచీ (ఫిబ్రవరి 23-27)లో, ధర్మశాల (మార్చి 7-11)లో ఐదవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది.
మైదానం సకాలంలో సిద్ధం కాకపోవడంతో ధర్మశాల ఈ ఏడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వలేదు. దీంతో ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఎంపిక చేవారు. మూడు వారాల విరామంతో ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత IPL 2024 ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ నుంచి ప్రపంచకప్‌నకు ముందు భారత్‌కు తమ సన్నాహాలను ఖరారు చేసుకునే అవకాశం లభించనుంది. ఇది కాకుండా 2023-24 దేశవాళీ సీజన్‌లో ఇంగ్లాండ్‌తో జట్టు ఎనిమిది టీ20 ఇంటర్నేషనల్‌లు, ఐదు టెస్టులు కూడా ఆడనుంది.
ఆస్ట్రేలియాతో తొలి వన్డే సెప్టెంబర్ 22న మొహాలీలో జరగనుండగా, మిగిలిన రెండు మ్యాచ్‌లకు ఇండోర్, రాజ్‌కోట్‌లు వరుసగా సెప్టెంబర్ 24, 27 తేదీల్లో ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దేశవాళీ సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే రేసులో ఓడిపోయిన మొహాలీ, నాగ్‌పూర్, రాజ్‌కోట్, ఇండోర్, తిరువనంతపురం వంటి వేదికలు హోమ్ సీజన్‌లో భర్తీ చేసి కనీసం రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయని బీసీసీఐ కార్యదర్శి జై షా సూచించారు.
బీసీసీఐ ఈ వారం మీడియా హక్కుల టెండర్‌ను ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితిలో షెడ్యూల్‌ను ప్రకటించాల్సిన అవసరం ఉంది. అక్టోబర్-నవంబర్‌లో స్వదేశంలో జరగనున్న ప్రపంచకప్ తర్వాత, దేశీయ సీజన్‌లో భారత్ వన్డేలు ఆడదు. వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత్ పాల్గొనాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు హోమ్ సీజన్‌లో ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డే ప్రపంచకప్ తర్వాత వారం తర్వాత ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా ఐదు టీ20 మ్యాచ్‌లు, ఆపై 2024 జనవరిలో ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆఫ్ఘనిస్తాన్ 2018లో భారత్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. అయితే దాని పరిమిత ఓవర్ల జట్టు భారత్‌లో తొలిసారిగా సిరీస్ ఆడనుంది.
తొలి టెస్టు: జనవరి 25-29 (హైదరాబాద్)
రెండో టెస్టు: ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు (విశాఖపట్నం)
మూడో టెస్టు: ఫిబ్రవరి 15-19 (రాజ్‌కోట్)
నాల్గవ టెస్ట్: ఫిబ్రవరి 23-27 (రాంచీ)
ఐదో టెస్టు: మార్చి 3 నుంచి 7 (ధర్మశాల)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..