IND vs ENG: ఐదు టెస్టుల సిరీస్‌లో చివరిది గెలచి, చారిత్రాత్మక విజయం సాధించేందుకు కోహ్లీసేన ఉత్సాహంగా సిద్ధమవుతోన్న క్రమంలో కోవిడ్ కలకలం రేగింది. దీంతో ఐదో టెస్ట్ మ్యాచ్ జరగడం సందేహంగా మారింది. ఆటగాళ్లకు అత్యంత సన్నిహితంగా ఉన్న జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కోవిడ్ పాజిటివ్ రావడంతో అంతా అయోమయంలో పడ్డారు. బుధవారం సాయంత్రం వరకు ఆటగాళ్లతోనే కలిసి పని చేయడంతో కేసులు మరిన్ని పేరిగే అవకాశం ఉందని సమాచారం. ఫిజియోకి కరోనా సోకడంతో ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకున్న భారత ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితమయ్యారు.
ఐదో టెస్ట్ జరగడంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా సందేహం వ్యక్తం చేయడంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ‘‘ప్రస్తుత స్థితిలో ఐదో టెస్టు ప్రారంభం అవుతుందో లేదో తెలియదు. కానీ, మ్యాచ్ మొదలవుతుందనే ఆశిస్తున్నా’’ అని గంగూలీ అన్నాడు.
అయితే, భారత ఆటగాళ్లకు చేసిన కోవిడ్ టెస్టులో అంతా నెగిటివ్‌గా తేలడంతో చివరి టెస్ట్ సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం (సెప్టెంబర్ 9) జరిగిన RT-PCR టెస్టుల్లో తాజా రౌండ్‌లో భారత ఆటగాళ్లందరూ నెగిటివ్‌గా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ఆటగాళ్లకు నెగెటివ్‌గా వచ్చినప్పటికీ, టెస్ట్ మ్యాచ్ అవకాశాలపై ఇప్పటివరకు ఇరు బోర్డుల నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ నుంచి నేరుగా ఐపీఎల్‌కు బయలుదేరబోతున్న జట్టు సభ్యులతోపాటు బృందంలోని పాజిటివ్ కేసులపై భారత బోర్డ్ భయాందోళనలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే భారత ఫిజియోలు – పర్మార్, నితిన్ పటేల్ ఇద్దరి సేవలు లేకుండానే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. లండన్‌లో నాలుగో టెస్ట్ ముగిసిన తరువాత హెడ్ కోచ్ రవిశాస్త్రి పాజిటివ్‌గా తేలడంతో ప్రస్తుతం టీం నుంచి దూరంగానే ఉన్నారు.
Also Read: Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్దం.. హీరోలుగా ఆ ఇద్దరిలో ఒకరు.?
T20 World Cup 2021: భావోద్వేగానికి గురైన ముంబై ప్లేయర్.. ఏడుస్తూ హార్దిక్‌కు హగ్ ఇచ్చిన ఇషాన్ కిషన్