టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. తన గత 11 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధశతకం కూడా చేయని అయ్యర్‌కు భారత టెస్టు జట్టు నుంచి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్ లోనూ పెద్దగా పరుగులు చేయట్లేదు శ్రేయస్. బౌలర్లు గురి చూసి మరీ షార్ట్ బాల్స్ సంధించి అయ్యర్‌ను ఔట్ చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులోనూ అయ్యర్ చాలా పేలవ ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని టీమ్ మేనేజ్‌మెంట్ సూచించింది.దీంతో పాటు శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ టెక్నిక్‌పై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి వరుసగా అవకాశాలు కల్పిస్తోంది. ఇంగ్లండ్‌పై కూడా అయ్యర్ రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. కాబట్టి మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. వైట్-బాల్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేసిన అయ్యర్‌కు టెస్టు క్రికెట్‌లో పరుగులు చేయడం కష్టమైంది. గత 11 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఇందులో రెండుసార్లు ఖాతా తెరవలేకపోయారు. అయ్యర్ చివరి 11 ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే, అతను కేవలం 4,12,0, 26, 31, 6, 0, 4*, 35, 13, 27చ 29 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మూడో టెస్టులోనూ అతడి స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో అయ్యర్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం ఇవ్వాలని పలువురు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
సర్ఫరాజ్ ఖాన్ దేశీయ టోర్నీల్లో రికార్డు అత్యద్భుతంగా ఉంది. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌పై సర్ఫరాజ్ 160 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత, కేఎల్ రాహుల్ స్థానంలో రెండో టెస్టుకు ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ డ్రవిడ్ శ్రేయాస్ అయ్యర్ అతనిని తొలగించే కఠినమైన చర్య తీసుకోగలరా లేదా అతనికి మరొక అవకాశం ఇస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటివరకు శ్రేయాస్ అయ్యర్ భారత్ తరఫున 14 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 36.86 సగటుతో 811 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ మాత్రమే ఉంది.మరోవైపు, సర్ఫరాజ్ ఖాన్ 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను 14 సెంచరీలు, 11 అర్ధ సెంచరీల సహాయంతో 69.85 సగటుతో 3912 పరుగులు చేశాడు.
Stumps on Day 3 in Vizag 🏟️
England 67/1 in the second-innings, need 332 more to win.
An eventful Day 4 awaits 👌👌
Scorecard ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/nbocQX36hB
— BCCI (@BCCI) February 4, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..