ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్.. టీమ్ నుంచి హర్షిత్ రాణా, వరుణ్ ఔట్! ఆ ఇద్దరి ప్లేస్‌లో ఎవరొచ్చారంటే..?

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. టీ20 పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి గాయాలతో దూరం కాగా వారి స్థానంలో మరో ఇద్దరు ఆటగాళ్లు జట్టులో చేరారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి రావడంతో సిరీస్‌పై భారీ అంచనాలున్నాయి.

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్.. టీమ్ నుంచి హర్షిత్ రాణా, వరుణ్ ఔట్! ఆ ఇద్దరి ప్లేస్‌లో ఎవరొచ్చారంటే..?
Harshit Rana And Varun Chak

Updated on: Jul 12, 2026 | 2:52 PM

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ముగిసింది. ఇక వన్డే సమరం ప్రారంభం కానుంది. టీ20ల్లో ఘోర పరాజయాలు చవిచూసిన టీమిండియా, కనీసం వన్డేల్లోనైనా ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ క్రమంలోనే వన్డే టీమ్‌లో మార్పులు చేస్తూ బీసీసీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే వన్డే సిరీస్‌కు ఎంపికైన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి గాయాలతో జట్టుకు దూరం అయ్యారు. దీంతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం వారికి రీప్లేస్మెంట్‌లను ప్రకటించింది.

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడిన ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్‌లనే వారికి రీప్లేస్మెంట్‌గా బీసీసీఐ ప్రకటించింది. వీరిద్దరి ఇంగ్లాండ్‌లోనే ఉండి, మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొననున్నారు. కాగా, ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. వీరు ఆడుతుండటంతో ఈ వన్డే సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైగా ఇంగ్లాండ్ జట్టు, భారత్‌‌పై టీ20 సిరీస్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన తర్వాత జరుగుతున్న సిరీస్ కావడంతో వన్డే సిరీస్ కోసం క్రికెట్ అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కచ్చితంగా ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటారని గట్టి నమ్మకంతో ఉన్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us