Shami-Pant: భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఆగస్టు 31 న తన 31 వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్‌లో బిజీగా ఉన్న షమీకి.. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే, మొహమ్మద్ షమీ కూడా అదేవిధంగా సరదాగా సోషల్ మీడియాలో సమాధానమిచ్చాడు. ఇద్దరి మధ్య ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షమీకి శుభాకాంక్షలు తెలుపుతూ.. షమీ జుట్టు రాలడంపై దృష్టిని పెట్టాలంటూ సూచించాడు. ప్రతిస్పందనగా, షమీ కూడా పంత్ అధిక బరువుపై కామెంట్ చేశాడు. ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. టెస్ట్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. భారత్, ఇంగ్లాండ్ టీంల మధ్య నాల్గవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా షమీ పుట్టినరోజు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫాస్ట్ బౌలర్ గాయం కారణంగా ఓవల్ టెస్టులో ఆడలేకపోయాడు. అదే సమయంలో, పంత్ మాత్రం టెస్టు మ్యాచ్‌లో ఆడుతున్నాడు. అలాగే అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శార్దుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం అందించాడు. అనంతరం వెనువెంటనే ఇద్దరూ పెవిలియన్ చేరారు.
మహమ్మద్ షమీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌తో పాటు, పంత్ నవ్వుతున్న ఎమోజీని కూడా పోస్ట్ చేశాడు. సెప్టెంబర్ 3 న ఈ ట్వీట్ చేశాడు. దీనికి, షమీ రెండు రోజుల తరువాత అంటే సెప్టెంబర్ 5 న సమాధానమిచ్చాడు. ‘నీకు సమయం వస్తుంది. కొడుకు, పిల్లలతోపాటు వయస్సుని ఎవరూ ఆపలేరు. కానీ, అధిక బరువును మాత్రం ఆపుకోకపోతే చాలా నష్టం’ అంటూ రాసుకొచ్చాడు.
అధిక బరువుతో బాధపడుతున్న పంత్..
పంత్ అధిక బరువు ఇప్పటికే చాలాసార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనలో, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా ఈ విషయంలో పంత్‌ను ఎగతాళి చేశారు. కానీ, పంత్ తన బ్యాటింగ్‌తో వారికి సమాధానమిచ్చాడు. ఇటీవలి కాలంలో, పంత్ తన ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపిస్తున్నాడు. ఈ కారణంగా, అతను టీమిండియాలో నంబర్ వన్ వికెట్ కీపర్ అయ్యాడు. అదే సమయంలో, భారత ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో షమీ ఒకరు. టెస్టుల్లో టీమిండియా విజయంలో అతనిది కీలక పాత్ర. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మతో పాటు షమీ భారత పేస్ త్రయంగా పేరుగాంచారు.
ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో, షమీకి గాయం కారణంగా చోటు దక్కలేదు. ప్రస్తుతం భారత్ ఐదవ టెస్టుతో పాటు టీ 20 ప్రపంచకప్ ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితిలో, టీం మేనేజ్‌మెంట్ షమీతో రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదని తెలుస్తోంది.
Apna time aayega beta ball or Umar ko koi nahi rook saka but motape ka treatment aaj bhi hota hai @RishabhPant17 ??♂️ ??♂️??♂️??♂️????? https://t.co/AddyqeleGt
— Mohammad Shami (@MdShami11) September 4, 2021
Virat Kohli: పెవిలియన్ చేరిన కోహ్లీ కోపంతో ఏంచేశాడో తెలుసా..? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
ENG vs IND: బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో టీమిండియా ఓపెనర్.. ద్రవిడ్ రికార్డునూ బ్రేక్ చేసిన రోహిత్