IND vs ENG: రెండో రోజు ఆట వర్షార్పణం.. ఇంకా 58 పరుగుల వెనుకంజలోనే టీమిండియా

|

Aug 06, 2021 | 2:11 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 46.4 ఓవర్లలో 125/4 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ 57 పరుగులు(151 బంతుల్లో 9ఫోర్లు), రిషబ్ పంత్ 7పరుగుల(8 బంతుల్లో 1 ఫోర్)తో నాటౌట్‌గా నిలిచారు.

IND vs ENG: రెండో రోజు ఆట వర్షార్పణం.. ఇంకా 58 పరుగుల వెనుకంజలోనే టీమిండియా
Nottinggham Test Ind Vs Eng
Follow us on

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 46.4 ఓవర్లలో 125/4 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ 57 పరుగులు(151 బంతుల్లో 9ఫోర్లు), రిషబ్ పంత్ 7పరుగుల(8 బంతుల్లో 1 ఫోర్)తో నాటౌట్‌గా నిలిచారు. కాగా, రెండవ రోజు ఆటకు వర్షంతో పాటు బ్యాడ్ లైట్‌ అడ్డుపడ్డాయి. దీంతో పూర్తి ఓవర్లు పడకుండానే ఆట ముగిపిపోయింది. టీమ్‌ఇండియా ఇంకా 58 పరుగుల వెనుకంజలోనే ఉంది. అంతకుముందు టీమిండియా 21/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం ఆటను ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ 36 పరుగులు (107 బంతుల్లో 6×4), కేఎల్‌ రాహుల్‌ మొదటి వికెట్‌కు 97 పరుగులు జోడించారు. ఈ మ్యాచులో రోహిత్‌ శర్మ తనకు రెగ్యులర్ ఆటకు భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. ఎంతో సహనంతో క్రీజులో నిలిచి పరుగులు సాధించాడు. లంచ్ సమయానికి ముందు రోహిత్ శర్మ.. రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌ ఆడబోయి పెవిలియన్ చేరాడు. లంచ్ అనంతరం మరో మూడు వికెట్లు వెంటవెంటనే పడిపోయాయి. అండర్సన్‌ వేసిన 41వ ఓవర్‌లో పుజారా (4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(0) వరుస బంతుల్లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే ఈ మ్యాచులో అండర్సన్ ఒకే ఓవర్‌లో పుజరా, విరాట్‌ కోహ్లీలను ఔట్ చేసి కీలక మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్‌ సీనియర్‌ పేస్ బౌలర్ జేమ్స్‌ అండర్సన్‌ భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. అత్యధిక వికెట్ల జాబితాలో అనిల్ కుంబ్లే సరసన చేరాడు. టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 619 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

అనంతరం వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(5) అనవసర రన్ కోసం ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. రాహుల్‌‌తో కలిసి రిషభ్ పంత్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త ఆడారు. ఈ క్రమంలోనే అనేకసార్లు వర్షం అడ్డుపడడంతో రెండో రోజు ఆటను ఆపేశారు. టీమిండియా రెండో సెషన్‌లో 46.1 ఓవర్ల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. అనంతరం మూడో సెషన్‌ను ప్రారంభించిన అంపైర్లు.. ఓ బంతి పడగానే మరలా వర్షం అడ్డుపడింది. దీంతో రెండోసారి ఆటను నిలిపేశారు. ఇలా రెండవ రోజు వర్షం పలుమార్లు అడ్డుపడడంతో చివరికి వాతావరణం అనుకూలించకపోవడంతో రెండో రోజు ఆటను నిలిపివేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.

Also Read: క్రికెట్ ప్రియులకు గ్రేట్‌న్యూస్.. భారత్, పాక్ తలపడే రోజు కన్‌ఫర్మ్.. వీడియో

IND vs ENG 1st Test Day 2 Highlights: రెండో రోజు ఆటకు బ్రేక్.. 125/4 స్కోరుతో టీమిండియా..