IND vs ENG: సెంచరీల ప్లేయర్‌కు లైన్ క్లియర్.. రాజ్‌కోట్‌లో ‘కింగ్‌’లా ఎంట్రీ.. ఛాన్సివ్వకుంటే రోహిత్‌కు మూడినట్లే?

India Probable Playing XI For 3rd Test: మూడో టెస్ట్ మ్యాచ్‌లో, ఇంగ్లండ్ జట్టు పూర్తి లయలో ఉన్నట్లు, చాలా బలంగా కనిపిస్తోంది. కాబట్టి, భారతదేశం బలమైన జట్టుతో మైదానంలోకి దిగవలసి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి గైర్హాజరీలో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి అవకాశం ఉంటుందో ఓసారి చూద్దాం.

IND vs ENG: సెంచరీల ప్లేయర్‌కు లైన్ క్లియర్.. రాజ్‌కోట్‌లో కింగ్‌లా ఎంట్రీ.. ఛాన్సివ్వకుంటే రోహిత్‌కు మూడినట్లే?
Ind Vs Eng 3rd Test

Updated on: Feb 13, 2024 | 3:42 PM

Ind vs Eng 3rd test: ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. మూడో టెస్టుకు కేఎల్ రాహుల్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో దేవదత్ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే, భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మొత్తం టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.

మూడో టెస్ట్ మ్యాచ్‌లో, ఇంగ్లండ్ జట్టు పూర్తి లయలో ఉన్నట్లు, చాలా బలంగా కనిపిస్తోంది. కాబట్టి, భారతదేశం బలమైన జట్టుతో మైదానంలోకి దిగవలసి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి గైర్హాజరీలో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి అవకాశం ఉంటుందో ఓసారి చూద్దాం.

సర్ఫరాజ్ అరంగేట్రం?

మూడో టెస్టు మ్యాచ్‌లో, యశస్వి జైస్వాల్ మరోసారి రోహిత్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుండగా , శుభ్‌మాన్ గిల్ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌ల గైర్హాజరీలో సర్ఫరాజ్ ఖాన్‌కు నాలుగో ర్యాంక్‌లో అవకాశం లభించవచ్చు. ఇదే జరిగితే ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. రజత్ పాటిదార్‌కు ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రావచ్చు, ఆరో స్థానంలో కేఎస్ భరత్ లేదా ధ్రువ్ జురైల్ ఆడే అవకాశం ఉంది.

రవీంద్ర జడేజా మూడో టెస్టులో ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. అతను జట్టులోకి రాకపోతే, అక్షర్ పటేల్ ఏడవ స్థానంలో, ఆర్ అశ్విన్ ఎనిమిదో స్థానంలో ఉంటాడు. రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌కు అవకాశం లభించింది. రాజ్‌కోట్ ట్రాక్, అతని గత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే, కుల్డీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కనుంది. ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్‌లతో భారత్ రంగంలోకి దిగుతుంది.

మూడో టెస్టుకు టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్, ధ్రువ్ జురైల్/కేఎల్ భరత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us