IND vs ENG 1st Test: హైదరాబాద్‌లో రోహిత్ సేన తగ్గేదేలే.. రికార్డులన్నీ భారత్‌ వైపే.. మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు షాక్

India vs England: హైదరాబాద్‌లో ఇరు జట్లు తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాయి. ఇప్పటి వరకు ఈ మైదానంలో ఇంగ్లండ్‌తో టెస్టు ఫార్మాట్‌లో భారత్‌ తలపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ ఉత్కంఠగా ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో, ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు 5 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో భారత్ 4 గెలిచింది. ఈ మైదానంలో టీమిండియా ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు.

IND vs ENG 1st Test: హైదరాబాద్‌లో రోహిత్ సేన తగ్గేదేలే.. రికార్డులన్నీ భారత్‌ వైపే.. మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు షాక్
Uppal Stadium Ind Vs Eng Te

Updated on: Jan 25, 2024 | 6:15 AM

India vs England Hyderabad Test 2024: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి అంటే జనవరి 25 నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లు సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి. ఒకవైపు ఇంగ్లండ్‌కు భారత స్పిన్‌ ఎటాక్‌ సవాల్‌ అయితే మరోవైపు ఇంగ్లండ్‌ ‘బేస్‌బాల్‌’ క్రికెట్‌ ఆడటం భారత్‌కు కూడా పెద్ద సవాల్‌గా మారనుంది. అయితే, హైదరాబాద్‌లో భారత టెస్టు రికార్డు ఎలా ఉంది? ఇక్కడ పిచ్ ఎలా ఉంటుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్-ఇంగ్లండ్ మధ్య తొలిసారిగా హైదరాబాద్ వేదికగా టెస్టు మ్యాచ్..

హైదరాబాద్‌లో ఇరు జట్లు తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాయి. ఇప్పటి వరకు ఈ మైదానంలో ఇంగ్లండ్‌తో టెస్టు ఫార్మాట్‌లో భారత్‌ తలపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ ఉత్కంఠగా ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో, ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు 5 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో భారత్ 4 గెలిచింది. ఈ మైదానంలో టీమిండియా ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. 2018లో వెస్టిండీస్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి డేంజరస్ జట్లను ఓడించడంలో భారత్ విజయం సాధించింది.

అత్యధిక, అత్యల్ప స్కోర్లు..

ఈ మైదానంలో అత్యధిక స్కోరు 687 పరుగులు. ఇది 2017లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల నష్టానికి భారత్ స్కోర్ చేసింది. అదే సమయంలో, 2018లో వెస్టిండీస్ చేసిన 127 పరుగుల అత్యల్ప స్కోరుగా నిలిచింది. ఈ మైదానంలో భారత్ అత్యల్ప స్కోరు 367 పరుగులు. ఈ గడ్డపై భారత్‌ను ఓడించడం ఇంగ్లండ్‌కు అంత సులభం కాదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

పిచ్ పరిస్థితి..

మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పిచ్‌పై ఓ ప్రకటన చేశాడు. పిచ్ గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. మ్యాచ్ ప్రారంభం కాగానే దాని గురించి తెలుస్తుంది. నేను చూసిన దాని ప్రకారం ఈ పిచ్ చాలా బాగుంది. అయితే, పిచ్ స్పిన్నర్లకు టర్న్‌ని అందిస్తుంది. ఎంత త్వరగా లేదా ఎంత వేగంగా జరుగుతుందనేది నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను. ఆట పురోగమిస్తున్న కొద్దీ బంతి ఖచ్చితంగా మరింత మలుపు తిరుగుతుంది. ఈ పిచ్‌పై స్పిన్నర్లకు చాలా సహాయం అందుతుంది అదే సమయంలో పిచ్ కూడా బ్యాట్స్‌మెన్స్‌కు అద్భుతంగా ఉందంటూ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..