బంగ్లాదేశ్‌తో బుధవారం (డిసెంబర్ 7) జరిగిన సెకండ్ వన్డేలో వీరోచితంగా పోరాడిన టీం ఇండియా 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. నిజానికి బంగ్లా 69 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి నష్టంలో ఉండింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన మెహిదీ హసన్ మిరాజ్ నాటౌట్‌తో సెంచరీ కొట్టాడు. మహ్మదుల్లా 77 స్కోర్ ఇచ్చి కీలక ఇన్నింగ్స్ చేశాడు. వీరిద్దరు కలిసి 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో వీరి స్కోర్ అమాంతంగా పెరిగిపోయింది.
ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వీరోచితంగా పోరాడి 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్‌లో భారత్ జట్టుకు 20 పరుగులు అవసరమైన సందర్భంలో రోహిత్ శర్మ 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. ఐతే ముస్తాఫిజర్ బౌలింగ్ కారణంగా కేవలం 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక భారత్ జట్టులో వాషింగ్టన్ సుందర్ (3/37), మహ్మద్ సిరాజ్ (2/73), ఉమ్రాన్ మాలిక్ (2/58) స్కోర్ సాధించారు. దీంతో బంగ్లాదేశ్ 5 పరుగుల తేడాతో భారత్‌పై మరోమారు విజయం సాధించింది. మూడు సిరీస్‌ల ఓడీఐలో చివరి మ్యాచ్ చిట్టగాంగ్ వేదికగా శనివారం నాడు జరగనుంది.
Bangladesh hold their nerve to win a thriller ?#BANvIND | Scorecard ? https://t.co/A76VyZDXby pic.twitter.com/d2pDja0lQV
— ICC (@ICC) December 7, 2022
మరిన్ని తాజా క్రికెట్ అప్‌డేట్ల కోసం క్లిక్ చేయండి.