IND vs AUS: కొత్త బౌలర్.. చెత్త బాల్స్.. జోకర్లుగా మారిన టీమిండియా దిగ్గజాలు.. లిస్టులో చేరిన సూర్య..

|

Feb 10, 2023 | 4:03 PM

Nagpur Test: విరాట్, పుజారా కొత్త బౌలర్‌ చేతిలో కీలుబొమ్మలా మారారు. వీరికి తోడు సూర్యకుమార్ యాదవ్ కూడా తనదైన శైలిలో పెవిలియన్ చేరాడు. ఫలితంగా, కాగితంపై బలంగా ఉన్న భారత మిడిల్ ఆర్డర్ మైదానంలో తేలిపోయింది.

IND vs AUS: కొత్త బౌలర్.. చెత్త బాల్స్..  జోకర్లుగా మారిన టీమిండియా దిగ్గజాలు.. లిస్టులో చేరిన సూర్య..
Indian Cricket Team
Follow us on

టీమిండియా మిడిలార్డర్‌పై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. మరోవైపు మాజీలు ఫైర్ అవుతున్నారు. విరాట్, పుజారా, సూర్యకుమార్ యాదవ్‌లు నాగ్‌పూర్‌లో సత్తా చాటుతారని ఆశిస్తే.. అందకు విరుద్ధంగా నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియన్ బౌలర్ల ధాటికి, ముఖ్యంగా కొత్త బౌలర్ చేతిలో ఘోరంగా బలయ్యారు. అపారమైన అనుభవం ఉన్న విరాట్, పుజారా ఒక కొత్త బౌలర్ బౌలింగ్‌లో, అది కూడా చాలా చెత్త బంతికి ఔట్ కావడం అందర్నీ నిరాశకు గురిచేసింది. వీరికి తోడు సూర్యకుమార్ యాదవ్ కూడా తనదైన శైలిలో పెవిలియన్ చేరాడు. ఫలితంగా, కాగితంపై బలంగా ఉన్న భారత మిడిల్ ఆర్డర్ మైదానంలో తేలిపోయింది.

భారత్‌కు చెందిన ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు నాగ్‌పూర్‌లో పరుగుల వరద పారించి ఉండేవారు. కానీ, పరిస్థితి దారుణంగా మారడంతో.. వారి అంచనాలు కలగానే మిగిలిపోయాయి. భారత క్రికెట్‌లో 300 పరుగులు జోడించగల సత్తా ఉన్న ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు కలిసి స్కోరు బోర్డుకు 30 పరుగులు కూడా జోడించలేకపోయారు. విచారకరమైన విషయం ఏమిటంటే, వారి పేలవమైన ప్రదర్శనకు వారి చెత్త షాట్లే కారణం కావడంతో మాజీలు ఫైర్ అవుతున్నారు.

జోకర్లుగా మారారా?

ఈ పరిస్థితికి వారు సెలక్ట్ చేసుకున్న షాట్లే కావడంతో నెట్టింట్లో జోకర్లుగా మారారు. అయితే, రోహిత్ మాత్రం ఓ ఎండ్‌లో నిలబడి పరుగుల వర్షం కురిపించాడు. అద్భుత ఆటతో సెంచరీ చేసి, టీమిండియాను లీడింగ్‌లోకి తీసుకొచ్చాడు. టీమిండియా త్రిమూర్తులు ఆడిన షాట్లను ఓసారి చూద్దాం..

ఇవి కూడా చదవండి

పుజారా: పుజారాను భారత టెస్ట్ స్పెషలిస్ట్ అని పిలుస్తారు. కానీ, అతను ఔట్ అయిన షాట్ చూస్తే మాత్రం తల పట్టుకోవాల్సిందే. అది కూడా బౌలర్ కొత్తవాడు. బంతి చెత్తది. టాడ్ మర్ఫీ వేసిన బాల్‌పై పుజారా స్కోర్ చేయాలనుకున్నాడు. ఇందుకోసం స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అతను షార్ట్ ఫైన్ లెగ్ వద్ద బోలాండ్ చేతికి చిక్కాడు.

విరాట్: విరాట్ కోహ్లి తన వికెట్‌ను మరింత దారుణంగా పెవిలియన్ చేర్చాడు. అతను ఔటైన బంతి, రెండో రోజు ఆటలోని చెత్త బంతుల్లో ఒకటిగా మారింది. లెగ్ స్టంప్ వెలుపలికి వెళుతున్న బంతిని ఫ్లిక్ చేయడానికి కోహ్లీ ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్ అంచుకు చేరుకుంది. అతను వికెట్ కీపర్ కారీకి క్యాచ్ ఇచ్చాడు. దీంతో తన తొలి టెస్టులోనే ఇద్దరు పెద్ద బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు పడగొట్టాలన్న మర్ఫీ కల కూడా నెరవేరింది.

టెస్టును టీ20గా పరిగణించిన సూర్యకుమార్‌: సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేయాలని అనుకున్నాడు. నిజానికి టెస్టులోనూ టీ20 తరహాలో షాట్లు ఆడాలని భావించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ వికెట్‌ను లయన్ పడగొట్టాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో తన మొదటి ఇన్నింగ్స్‌లో 20 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..