గత ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బాలో రిషబ్ పంత్ ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్ అందరికీ గుర్తుంటుంది. తన మెరుపు ఇన్నింగ్స్ తో టీమ్ ఇండియాకు విజయాన్ని అందించిన రిషబ్ పంత్.. సిరీస్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ టూర్‌లోనూ పంత్ నుంచి అదే విధమైన ప్రదర్శన ఆశించారు. అయితే ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో పంత్ ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఆడిన అన్ని ఇన్నింగ్స్‌ల్లోనూ అనవసర షాట్లు ఆడుతూ వికెట్లు సమర్పించుకుంటున్నాడీ డ్యాషింగ్ ప్లేయర్. ప్రస్తుతం జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్‌లోనూ పంత్ అదే బాధ్యతా రహితమైన షాట్‌ను ఆడి పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇది జట్టును ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా, కామెంటేటర్ గా వ్యవహరిస్తోన్న దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌కు కోపం తెప్పించింది. మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 37 బంతుల్లో 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. జట్టుకు అవసరమైన సమయంలో పంత్ అనవరసర స్కూప్ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. అంతకు ముందు బంతిని కూడా ఫైన్ లెగ్ మీదుగా పిక్-అప్ ర్యాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ సక్సెస్ కాలేదు. ఆ తర్వాతి బంతితోనూ అదే ప్రయత్నం చేసిన పంత్ మళ్లీ ర్యాంప్ షాట్ ఆడాడు. కానీ బంతి బ్యాట్ అంచుకు తగిలి డీప్ థర్డ్ మ్యాన్ వద్ద నిలబడి ఉన్న నాయన్ లియాన్ వద్దకు వెళ్లింది.
రిషబ్ పంత్ ఆడిన ఈ బాధ్యతారహిత షాట్‌ని చూసిన సునీల్ గవాస్కర్ లైవ్ మ్యాచ్‌లోనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. పరుష పదుజాలంతో పంత్ పై విరుచుకు పడ్డాడు. ‘ఇద్దరు ఫీల్డర్లు డీప్ థర్డ్ మ్యాన్ వద్ద నిలబడి ఉన్నప్పుడు అలాంటి షాట్ ఎలా ఆడతారు. ఆఖరి బంతితోనూ అదే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. మరోసారి అదే షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నావు. ఇది మీ సహజమైన ఆట అని చెప్పలేము. ఇది మీ గేమ్ ఏ మాత్రం కాదు. పరిస్థితిని అర్థం చేసుకుని షాట్ సెలెక్షన్ చేసుకోవాలి’ అని పంత్ పై మండిపడ్డాడు సన్నీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
“Stupid, stupid, stupid!” 😡
🏏 Safe to say Sunny wasn’t happy with Rishabh Pant after that shot.
Read more: https://t.co/bEUlbXRNpm
💻📝 Live blog: https://t.co/YOMQ9DL7gm
🟢 Listen live: https://t.co/VP2GGbfgge #AUSvIND pic.twitter.com/Fe2hdpAtVl— ABC SPORT (@abcsport) December 28, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..