భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ముగిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీను మరోసారి టీమిండియా 2-1 తేడాతో సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ భారత్ జట్టు అద్భుతమైన ఆటతీరు కనబరిచి.. స్వదేశంలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. అయితే, 20 ఏళ్ల క్రితం ఇదంతా ఈజీ కాదు. ఆ సమయంలో ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి విధ్వంసకర జట్టుపై చాలా కష్టపడి అద్భుతమైన విజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ చారిత్రాత్మక విజయంలో టీమిండియా స్టార్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కీలక పాత్ర పోషించాడు. అయితే అది బ్యాట్‌తో కాదు.. బంతితో.. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..
22 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించింది. స్టీవ్ వా సారధ్యంలోని ఈ విధ్వంసకర జట్టుపై టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సిరీస్ మొదటి మ్యాచ్‌లో భారత్‌పై ఆసీస్ సునాయాసంగా విజయం సాధించగా.. ఆ తర్వాత కోల్‌కతాలో జరిగిన టెస్టులో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఆట కాస్తా తారుమారైంది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత్‌ను కేవలం 171 పరుగులకే ఆలౌట్ చేసి ఫాలోఆన్‌లోకి నెట్టింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా విజృంభించింది. రాహుల్ ద్రవిడ్(180), వీవీఎస్ లక్ష్మణ్(281)తో పాటు సచిన్ టెండూల్కర్(3/31) కూడా మ్యాజిక్ చేశాడు. కానీ సచిన్ బ్యాట్‌తో కాదు.. బంతితో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెట్టాడు. టెండూల్కర్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాట్‌తో 10 పరుగులు, 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
భారత్ నిర్దేశించిన 384 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఐదో రోజు స్కోరు 167 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ సచిన్ టెండూల్కర్‌కు బంతిని అందించాడు. కట్ చేస్తే.. తన వరుస 3 ఓవర్లలో ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హేడెన్, షేన్ వార్న్‌లను ఎల్‌బిడబ్ల్యుగా అవుట్ చేసి.. 174 పరుగులకు ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయేలా చేశాడు. ఇక హర్భజన్ చివరి రెండు వికెట్లు పడగొట్టి.. భారత్‌కు 171 పరుగుల చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కాగా, ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో హర్భజన్ 73 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు.
On this Day 2001 Unsung Sachin’s Magical Spell @ Kolkata Test?
Day 5, Target 384 Aus 167/5, trying to save Test.
Dada gave Ball to @sachin_rt
??
SRT Took 3 Wickets Hayden (67) Gilly (0) Warne (0) & Insured Ind’s WIN.
What were you when this happened?pic.twitter.com/6yrngmztVh— CrickeTendulkar ?? (@CrickeTendulkar) March 15, 2023