Rohit Sharma Records: స్టార్ ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ICC ఫైనల్లోప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. నేటి నుంచి అంటే బుధవారం (జూన్ 7) నుంచి లండన్‌లోని ఓవల్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇది రోహిత్‌కి 50వ టెస్ట్ మ్యాచ్‌గా నిలిచింది. 36 ఏళ్ల హిట్ మ్యాన్ ఐసీసీ కోసం దశాబ్దాల నిరీక్షణను ముగింపు పలుకుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్‌ను గెలుచుకోవడం ద్వారా ఐసీసీ టైటిల్ సాధించాలని కోరుతున్నారు.
ICC ఈవెంట్‌లో భారతదేశం తరపున తన ఆరో ఫైనల్‌ను ఆడుతోన్న రోహిత్.. సారథ్యంతోపాటు బోర్డులో భారీ స్కోరును నమోదు చేయాలనుకుంటున్నాడు. అతని ఇటీవలి ఫామ్ ఇబ్బందిగా ఉన్నప్పటికీ, రోహిత్‌ను తేలికగా తీసుకోలేం. ముఖ్యంగా అతను ఆస్ట్రేలియా జట్టుపై పరుగుల వర్షం కురిపిస్తుంటాడు. ఇప్పుడు కూడా అలానే చేయాలని ఆశిస్తున్నాడు.
ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేస్తాడా..: జూన్ 23, 2007న ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ తరపున అరంగేట్రం చేసిన రోహిత్.. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత మాజీ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఎంఎస్ ధోని 17,092 పరుగులను అధిగమించి ఐదో ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఫార్మాట్‌లలో మొత్తం 440 మ్యాచ్‌లు ఆడి, అందులో 17057 పరుగులు చేసిన రోహిత్.. ధోనీ పరుగుల మార్క్‌ను అధిగమించడానికి కేవలం 36 పరుగులు చేయాల్సి ఉంటుంది.
సంఖ్య | ఆటగాడు | కాల వ్యవధి | మ్యాచ్‌లు | పరుగులు | బెస్ట్ స్కోర్ | సగటు | 100/50 | |
1. | సచిన్ టెండూల్కర్ | 1989-2013 | 664 | 34357 | 248* | 48.52 | 100/164 | |
2. | విరాట్ కోహ్లీ | 2008-ప్రస్తుతం | 497 | 25322 | 254* | 53.53 | 75/130 | |
3. | రాహుల్ ద్రవిడ్ | 1996-2012 | 504 | 24064 | 270 | 45.57 | 48/145 | |
4. | సౌరవ్ గంగూలీ | 1992-2008 | 421 | 18433 | 239 | 41.42 | 38/106 | |
5. | ఎంఎస్ ధోని | 2004-2019 | 535 | 17092 | 224 | 44.74 | 15/108 | |
6. | రోహిత్ శర్మ | 2007-ప్రస్తుతం | 440 | 17057 | 264 | 42.74 | 43/91 |
WTCలో భారత్ తరపున అగ్రస్థానం: రోహిత్ శర్మ ఇప్పటివరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండు ఎడిషన్‌లలో మొత్తం 22 మ్యాచ్‌లలో ఆడాడు. 52.76 సగటుతో 1794 పరుగులు చేశాడు. WTC చరిత్రలో భారత్ తరపున పరుగుల జాబితాలో నం. 2 స్థానంలో ఉన్నాడు. 31 గేమ్‌లలో 1803 పరుగులు చేసిన విరాట్ కోహ్లి తర్వాత నిలిచాడు. WTC 2023 ఫైనల్‌లో రోహిత్, విరాట్ ఇద్దరూ యాక్షన్‌లో కనిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే, రోహిత్ ప్రస్తుతం 10 పరుగులు సాధిస్తే.. WTCలో భారత్ తరపున అగ్రస్థానంలో నిలుస్తాడు. ప్రస్తుతం చెతేశ్వర్ పుజారా 1728 పరుగులతో 3వ స్థానంలో ఉన్నాడు.
కపిల్ దేవ్, ధోనీ ఎలైట్ లిస్ట్‌లో చేరే ఛాన్స్: ఓవల్‌లో జరిగే WTC 2023 ఫైనల్‌లో రోహిత్ సేన ఆస్ట్రేలియాను ఓడించగలిగితే, కపిల్ దేవ్, ధోనీ తర్వాత భారతదేశం తరపున ICC ట్రోఫీని గెలుచుకున్న మూడవ భారత కెప్టెన్‌గా మారతాడు. భారత కెప్టెన్‌గా కపిల్ 1983 ODI ప్రపంచకప్‌ను గెలుచుకున్నాడు. ధోని 2007 T20 ప్రపంచకప్, 2011 ODI ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని భారత కెప్టెన్‌గా గెలుచుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..