IND vs AUS 2nd Test: నయావాల్ కెరీర్‌లో స్పెషల్ మ్యాచ్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్రధాని మోదీ.. ఎందుకో తెలుసా?

|

Feb 15, 2023 | 9:30 AM

ఢిల్లీలో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్టు పుజారా కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ కానుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

IND vs AUS 2nd Test: నయావాల్ కెరీర్‌లో స్పెషల్ మ్యాచ్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్రధాని మోదీ.. ఎందుకో తెలుసా?
Ind Vs Aus 2nd Test Pujara
Follow us on

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. సిరీస్‌లో ఆధిక్యాన్ని పెంచే విషయంలో ఢిల్లీలో జరిగే టెస్టు భారత జట్టుకు చాలా కీలకంగా మారింది. అయితే ఇది భారత బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారాకు ప్రత్యేకంగా ఉండనుంది. ఈ మ్యాచ్ అతని కెరీర్‌లో 100వ టెస్టుగా నిలివనుంది. ప్రపంచ క్రికెట్‌లో చాలా తక్కువ మంది ఆటగాళ్లు 100 టెస్ట్ మ్యాచ్‌ల పరిమితిని దాటారు. ఇప్పుడు ఆ జాబితాలో పుజారా ఎంట్రీ ఇవ్వనున్నాడు. విశేషమేమిటంటే, ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో ఆడనున్న పుజారాకు ప్రధాని మోడీ నుంచి ముందస్తు అభినందనలు అందాయి.

100వ టెస్టుకు ముందు పుజారా ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు వెళ్లాడు. 100వ టెస్టుకు ముందు ప్రధాని మోదీని కలిసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘ఈ క్షణాలు నా ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రధాని మోదీని కలవడం నాకు గర్వకారణం. స్పెషల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

100వ టెస్టుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు..

ఛెతేశ్వర్ పుజారా ఈ సమావేశ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ట్వీట్‌ను ప్రధాని రీట్వీట్ చేశారు. పుజారాను కలవడం చాలా ఆహ్లాదకరమైన అనుభూతి అని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో ప్రకటించారు. అతని 100వ టెస్టు, కెరీర్‌కు శుభాకాంక్షలు’ అంటూ క్యాఫ్షన్ ఇచ్చారు.

ఛెతేశ్వర్ పుజారా కెరీర్..


పుజారా 99 టెస్టు మ్యాచ్‌ల్లో 44.15 సగటుతో 7021 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 19 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు సాధించాడు. 99 టెస్టుల్లో పుజారా చేసిన అత్యధిక స్కోరు 206 పరుగులుగా నిలిచింది. పుజారా అరంగేట్రం చేసినప్పటి నుంచి, అతను టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. టెస్టులో ఇప్పటి వరకు 15797 బంతులు ఎదుర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..