IND vs AUS: భారత్‌తో తలపడే కంగారుల టీం ఇదే.. ఎంట్రీ ఇచ్చిన తుఫాన్ సెంచరీల ప్లేయర్.. రోహిత్ సేనకు స్ట్రాంగ్ వార్నింగ్..

India vs Australia ODI Series: భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కెప్టెన్ పాట్ కమిన్స్‌తో సహా గాయపడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లందరూ తిరిగి జట్టులోకి రావడం పెద్ద వార్తగా మారింది.

IND vs AUS: భారత్‌తో తలపడే కంగారుల టీం ఇదే.. ఎంట్రీ ఇచ్చిన తుఫాన్ సెంచరీల ప్లేయర్.. రోహిత్ సేనకు స్ట్రాంగ్ వార్నింగ్..
Ind Vs Aus Odi Series

Updated on: Sep 17, 2023 | 3:39 PM

India vs Australia ODI Series: ప్రపంచకప్‌నకు ముందు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్ట్ కంగారూల జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా ఆదివారం 18 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అందులో ఆశ్చర్యకరమైన పేరు కూడా ఉంది. భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు జట్టులో అవకాశం పొందిన మార్నస్ లాబుస్‌చాగ్నే గురించి మాట్లాడుతున్నాం. ఆస్ట్రేలియాకు చెందిన ఈ కీ ప్లేయర్.. ఎలాంటి మ్యాచ్‌నైనా ఇట్టే మార్చేయగలడు. ఫిట్‌గా ఉన్న తర్వాత తిరిగి జట్టులోకి రావడం పెద్ద వార్తగా నిలిచింది. వీరిలో పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్ ఉన్నారు. కామెరాన్ గ్రీన్ కూడా ఫిట్‌గా తిరిగి వచ్చాడు.

ట్రావిస్ ఔట్..

ఆస్ట్రేలియాకు చెందిన ఎడమచేతి వాటం తుఫాన్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ వన్డే సిరీస్‌లో ఎంపిక కాలేదు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో ఈ ఆటగాడు చేతికి గాయమైంది. చేతిలో ఫ్రాక్చర్ ఉంది. అతను ప్రపంచ కప్ ఆడలేడని తెలుస్తోంది. ట్రావిస్ హెడ్‌కు గాయం కారణంగా, ఇప్పుడు మార్నస్ లాబుస్‌చాగ్నే భారత పర్యటనకు ఎంపికయ్యాడు. ఈ ఆటగాడు ప్రపంచ కప్‌లో కూడా ఆడతాడని నమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి

వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు – పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుషాగ్నే, అలెక్స్ కారీ, షాన్ ఎబ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంగ్హా షార్ట్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్..

సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ మొహాలీలో జరగనుంది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 24న ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. మూడో మ్యాచ్ సౌరాష్ట్రలో సెప్టెంబర్ 27న జరగనుంది.

గత సిరీస్‌లో ఆస్ట్రేలియా దూకుడు..

ఈ ఏడాది మార్చిలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన చేసి టీమిండియాను 2-1తో ఓడించింది. ఆ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా గట్టి ఎదురుదాడి చేసి విశాఖపట్నం, చెన్నైలో టీమిండియాను ఓడించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..