IND vs AUS: ఆస్ట్రేలియాలో భయపెడుతోన్న టీమిండియా ఛేజింగ్ రికార్డులు.. డ్రా చేసుకోవాలన్నా కష్టమే భయ్యో..

|

Dec 29, 2024 | 1:40 PM

Highest Run Chases by India in Australia: ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుల్లో భారత్ ఛేజింగ్ రికార్డులు చూస్తే భారీ షాక్ తగలాల్సిందే. ఇప్పటి వరకు ఛేజింగ్‌లో భారత్‌ మూడు మ్యాచ్‌లు గెలిచి, 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అలాగే, మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఇక మెల్ బోర్న రికార్డులు చూస్తే మాత్రం భారత జట్టు డ్రా చేసుకోవడానికే ప్రయత్నించాల్సి ఉంటుంది.

IND vs AUS: ఆస్ట్రేలియాలో భయపెడుతోన్న టీమిండియా ఛేజింగ్ రికార్డులు.. డ్రా చేసుకోవాలన్నా కష్టమే భయ్యో..
Ind Vs Aus 4th Test Records
Follow us on

Highest Run Chases by India in Australia: మెల్‌బోర్న్‌లో జరిగే నాల్గవ టెస్టులో భారత్ ఛేజింగ్ చేసి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 2-1 ఆధిక్యం సాధించాలని చూస్తోంది. కానీ టీమిండియా ఛేజింగ్ రికార్డులు చూస్తే మాత్రం బిగ్ షాక్ తగులుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక నాలుగో రోజు ముగిసే సరికి 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి 333 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక ఐదో రోజు మ్యాచ్ ఉత్కంఠగా మారింది. మొత్తంగా భారత్ భారీ టార్గెట్ అందుకునే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు అసలు టీమిండియా ఛేజింగ్ చేసిన అత్యధిక పరుగులను ఓ సారి తెలుసుకుందాం..

ఆస్ట్రేలియాలో ఛేజింగ్‌ చేస్తున్న సమయంలో భారత జట్టు 3 సార్లు మాత్రమే విజయం సాధించగా, 16 సార్లు ఓడిపోయింది. 7 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఇందులో బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్‌లో ఓ చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. ఇక్కడ భారత్ 328 పరుగులను ఛేదించింది. దీంతో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌గా ఇది మిగిలిపోయింది. 2003లో అడిలైడ్‌లో 233 పరుగులకు ఛేజింగ్ చేయడంలోనూ భారత జట్టు విజయాన్ని సాధించింది.

ఆస్ట్రేలియాలో భారత్ అత్యధిక పరుగుల ఛేజింగ్..

329/7 vs ఆస్ట్రేలియా – బ్రిస్బేన్, 2021

233/6 vs ఆస్ట్రేలియా – అడిలైడ్, 2003

70/2 vs ఆస్ట్రేలియా – మెల్‌బోర్న్, 2020

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత జట్టు ఛేజింగ్ రికార్డులను ఓసారి పరిశీలిద్దాం..

చివరిసారిగా 2020లో భారత్‌ ఈ వేదికపై ఆడగా, 70 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ శతాబ్దంలో MCGలో అత్యధిక ఛేజింగ్‌ 2013లో చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 231 పరుగులను ఛేజ్ చేసింది.

2000 నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అత్యధిక పరుగుల ఛేజింగ్‌ల జాబితా ఇదే..

ఆస్ట్రేలియా 231/2 vs ఇంగ్లాండ్ – 2013

దక్షిణాఫ్రికా 183/1 vs ఆస్ట్రేలియా – 2008

ఆస్ట్రేలియా 127/1 vs పాకిస్తాన్ – 2004

ఆస్ట్రేలియా 107/5 vs ఇంగ్లాండ్ – 2003

ఆస్ట్రేలియా 97/1 vs భారత్ – 2003.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..