Golden Duck: టీ20ల్లో నంబర్ వన్ ప్లేయర్.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ డకౌట్స్‌తో వన్డేలో చెత్త రికార్డ్.. లిస్టులో ఆరుగురు..

|

Mar 23, 2023 | 4:53 AM

IND vs AUS 2023: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో, సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడో మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్‌తో ఔటయ్యాడు.

Golden Duck: టీ20ల్లో నంబర్ వన్ ప్లేయర్.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ డకౌట్స్‌తో వన్డేలో చెత్త రికార్డ్.. లిస్టులో ఆరుగురు..
Suryakumar Yadav
Follow us on

భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు ఏమాత్రం కలసిరాలేదు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్‌తో ఔటయ్యాడు. అంటే వరుసగా మూడు వన్డేల్లో తొలి బంతికే ఔట్ అయ్యి తిరిగి పెవిలియన్ బాట పట్టాడు. సూర్యకుమార్ యాదవ్ టీ20లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను గత ఏడాది కాలంలో టీ20 మ్యాచ్‌లలో పరుగుల వర్షం కురిపించాడు. అయితే సూర్యకుమార్ ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్‌లో ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. భారత జట్టు వన్డే ప్రపంచకప్‌కు సిద్ధమవుతోంది. అందుకే కెప్టెన్ రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను ప్రయత్నిస్తున్నాడు.

సూర్య వరుసగా మూడుసార్లు డకౌట్..

శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా, సూర్యకు వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. కానీ, నంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మెన్ తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. సూర్యకి ఇది తన కెరీర్‌లో హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే మ్యాచ్ ముంబైలో జరిగింది. ఇక్కడ సూర్యని మిచెల్ స్టార్క్ ఇన్‌సైడ్ బాల్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఆ తర్వాత విశాఖపట్నంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగ్గా.. ఈ మ్యాచ్‌లోనూ మిచెల్ స్టార్క్ ఇదే తరహాలో సూర్యను తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.

మొదట సచిన్ విషయంలోనూ ఇలానే..

ఆ తర్వాత మూడో మ్యాచ్ చెన్నైలో జరగ్గా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్ తన స్పిన్ బంతికి తొలి బంతికే సూర్యను బౌల్డ్ చేశాడు. ఈ విధంగా సూర్య హ్యాట్రిక్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే, సూర్య కంటే ముందే చాలా మంది భారత బ్యాట్స్‌మెన్స్ వన్డేల్లో హ్యాట్రిక్ డకౌట్స్ అయ్యారు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ సచిన్ టెండూల్కర్, 1994లో వరుసగా మూడు వన్డేల్లో సున్నాకి ఔటయ్యాడు. ఆ తర్వాత అనిల్‌ కుంబ్లే, జహీర్‌ఖాన్‌, ఇషాంత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా వన్డేల్లో సున్నాకే పెవిలియన్ చేరి హ్యాట్రిక్‌ సాధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..