Watch Video: రోహిత్ శర్మకు క్షమాపణలు చెప్పిన విరాట్ కోహ్లీ.. కారణం ఏంటో తెలుసా?

Rohit Sharma: టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 2వ రోజు ఆట మొదటి సెషన్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మిస్టేక్‌తో రోహిత్ రనౌట్ అయ్యే అవకాశాన్ని తప్పించుకున్నాడు. లేదంటే భారత్‌కు భారీ నష్టం జరిగేది.

Watch Video: రోహిత్ శర్మకు క్షమాపణలు చెప్పిన విరాట్ కోహ్లీ.. కారణం ఏంటో తెలుసా?
Kohli Sorry To Rohit

Updated on: Feb 10, 2023 | 4:49 PM

విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించాడు. అయితే, టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 2వ రోజు ఆట మొదటి సెషన్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో మిస్టేక్‌తో రోహిత్ రనౌట్ అయ్యే అవకాశాన్ని తప్పించుకున్నాడు. ఒకవేళ ఇదే జరిగి ఉంటే విరాట్‌పై తీవ్ర విమర్శలు వచ్చి ఉండేవి. ఆ తర్వాత రోహిత్ పుంజుకుని 212 బంతుల్లో 120 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ పెవిలియన్ చేర్చాడు.

కాగా, విరాట్ కోహ్లీ కేవలం 12 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే, విరాట్ కోహ్లీ చేసిన తప్పిదం కారణంగా రోహిత్ శర్మ తృటిలో ఔట్ కాకుండా తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

తొలి టెస్టు రెండో రోజు లంచ్ విరామ సమయానికి భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్‌కు ముందు, విరాట్ కోహ్లీ తప్పిదం కారణంగా రోహిత్ శర్మ తృటిలో రనౌట్ నుంచి తప్పించుకున్న సంఘటన వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లి ఈ తప్పును గ్రహించిన వెంటనే, కెప్టెన్ రోహిత్ శర్మకు సైగలలో క్షమాపణలు చెప్పాడు. కెప్టెన్ రోహిత్ తల వంచి, వెంటనే థంబ్స్-అప్ చూపించి క్షమించినట్లు ఓకే చూపించాడు.

భారత ఇన్నింగ్స్‌లో 48వ ఓవర్‌లో నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతికి విరాట్, రోహిత్ మధ్య సమన్వయం చెదిరిపోయింది. స్ట్రైక్‌లో ఉన్న కోహ్లి బంతిని మిడ్ వికెట్ వైపు ఆడాడు. కోహ్లీ సింగిల్‌ను పొందగలనని భావించాడు. రెండు-మూడు అడుగులు ముందుకు వేసి, ప్రమాదాన్ని చూసి తిరిగి వచ్చాడు. అయితే, నాన్-స్ట్రైకర్ ఎండ్ నుంచి పరుగు తీసుకోవడానికి రోహిత్ క్రీజు మధ్యలోకి వచ్చేశాడు. కోహ్లీ వెనక్కు తగ్గడం గమనించిన రోహిత్, వెనుకకు వెళ్లాడు. కోహ్లీ తప్పిదం కారణంగా అతను తృటిలో రనౌట్ నుంచి తప్పించుకున్నాడు.

రోహిత్ శర్మ సెంచరీ ప్రత్యేకతలు..

కెప్టెన్ రోహిత్ 171 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో రోజు ఆటలో సెంచరీ సాధించిన వెంటనే కెప్టెన్ రోహిత్ ప్రత్యేక ఫీట్ సాధించాడు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ కూడా ఈ ఘనత సాధించలేకపోయాడు. దీంతోపాటు మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ప్రపంచంలో నాలుగో కెప్టెన్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..