మరో రెండు రోజులలో స్వదేశీ గడ్డపై భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 ప్రారంభం కానున్న విషయం మనందరికీ తెలిసిందే. మొత్తం 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోని తొలి టెస్ట్ నాగపూర్ వేదికగా ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ దక్కించుకునేందుకు ఇరు జట్లు పోటీ పడనున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇరుజట్లు కూడా నాగపూర్ మైదానంలో తొలి టెస్ట్ కోసం ముమ్ముర సాధన చేస్తున్నాయి. అయితే ఈ టెస్ట్ ద్వారా భారత బ్యాటర్, రన్ మిషిన్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును అందుకోనేందుకు చేరువలో ఉన్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ మరి కొన్ని పరుగులు చేస్తే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు అవుతుంది. అదేమిటంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో ఇప్పటివరకు 546 ఇన్నింగ్స్‌ల్లో 24,936 పరుగులు చేసిన కోహ్లీకి.. 25 వేల పరుగులు పూర్తి చేసేందుకు కేవలం 64 పరుగులే అవసరం.
ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే మొదటి టెస్ట్‌లో కోహ్లీ 64 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 25 వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కుతాడు. మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్‌కు 24000 పరుగులు పూర్తి చేసేందుకే 543 ఇన్నింగ్స్‌లు పట్టాయి. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు మూడు ఫార్మాట్లలో 24000 పరుగులు పూర్తి చేసేందుకు 565 ఇన్నింగ్స్‌లు పట్టగా.. దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ జాక్ కలిస్‌కు 573 ఇన్నింగ్స్‌లు, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు 591 ఇన్నింగ్స్‌లు పట్టాయి.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ముందు 25000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్ మొత్తం 782 ఇన్నింగ్స్‌ల్లో 34357 పరుగులు చేయగా, కుమార సంగక్కర (666 ఇన్నింగ్స్‌ల్లో 28016 పరుగులు), రికీ పాంటింగ్ (688 ఇన్నింగ్స్‌ల్లో 27483 పరుగులు), మహేళ జయవర్ధనే (725 ఇన్నింగ్స్‌ల్లో 25957 పరుగులు), జాక్ కలిస్ (617 ఇన్నింగ్స్‌ల్లో 25534) ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. నాగపూర్ టెస్టులో విరాట్ కోహ్లీ మరో 64 రన్స్ చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో 25 వేల పరుగులు త్వరగా చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..