IND vs AFG: ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?

ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించడంతో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికై, తర్వాత రెస్ట్ పేరుతో తప్పుకున్న సిరాజ్‌కు మరోసారి అవకాశం దక్కలేదు. బుమ్రా, హర్షిత్ రాణా ఫిట్‌నెస్‌పై సందేహాలున్నా సిరాజ్‌ను పరిగణించకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

IND vs AFG: ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
Gambhir

Updated on: Sep 02, 2026 | 6:30 AM

ఆఫ్ఘనిస్థాన్‌తో ఈ నెలలో జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తిరిగి రాగా.. హార్థిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కూడా స్క్వౌడ్‌లో ఉన్నారు. కానీ వారు ఫిట్‌నెస్ సాధించాల్సి ఉంది. అంతా బాగానే ఉంది కానీ, టీ20 టీమ్‌లోకి మన హైదరాబాద్ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్‌ను ఎందుకు తీసుకోవడం లేదనే విమర్శలు క్రికెట్ అభిమానుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.

మొన్నటికి మొన్న జూన్‌లో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ కోసం సిరాజ్‌ను ఎంపిక చేసి, వెంటనే రెస్ట్ పేరుతో అతన్ని పక్కన పెట్టి అతని ప్లేస్‌లో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకున్నారు. అతను దారుణంగా విఫలం అయ్యాడు. పైగా పసికూన ఐర్లాండ్ చేతిలో టీమిండియా దారుణంగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. అయినా కూడా సిరాజ్‌ను టీ20 జట్టులోకి తీసుకోలేదు. రెస్ట్ పేరుతో పక్కనపెట్టారు.. రెండు నెలల తర్వాత కూడా అతనికి రెస్ట్ సరిపోలేదా? అని క్రికెట్ అభిమానులు అంటున్నారు. కావాలానే సెలెక్టర్లు సిరాజ్‌ను టీ20లకు దూరం పెడుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం జట్టులో బుమ్రా సైతం ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. ఇక ఒకే ఒక క్వాలిటీ పేసర్ అర్షదీప్ సింగ్ మాత్రమే పూర్తి స్థాయిలో ఫిట్ నెస్‌తో ఉన్నాడు. మరి బుమ్రా, హర్షిత్ రాణాలలో ఎవరు ఫిట్ నెస్ నిరూపించుకోలేకపోయినా.. అప్పుడైనా సిరాజ్ ను జట్టులోకి తీసుకుంటారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పోనీ వన్డే వరల్డ్ కప్ 2027 కోసం సిరాజ్‌ను రెడీ చేస్తున్నారా అంటే దానిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us