IND vs AFG: టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఆప్ఘాన్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు కింగ్ కోహ్లీ దూరం.. ఎందుకంటే?

|

Jan 10, 2024 | 7:02 PM

India vs Afghanistan, 1st T20I, Virat Kohli: మ్యాచ్‌కు ఒక రోజు ముందు మొహాలీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన టీమిండియా కోచ్ ద్రవిడ్, ఓ షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చాడు. దీంతో ఏడాది తర్వాత టీమిండియా దిగ్గజాల రీఎంట్రీని చూద్దామనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశను అందించాడు. అయితే, తొలి టీ20లో రోహిత్ శర్మ ఆటను మాత్రమే చూసే అవకాశం అభిమానులకు లభిస్తుంది.

IND vs AFG: టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఆప్ఘాన్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు కింగ్ కోహ్లీ దూరం.. ఎందుకంటే?
Ind Vs Afg 1st T20i Records
Follow us on

India vs Afghanistan, 1st T20I, Virat Kohli: రేపు అంటే, జనవరి 11వ తేదీ గురువారం నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ మొహాలీలో జరగనుంది. ఈ సిరీస్‌తో, టీమిండియాలోని ఇద్దరు వెటరన్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఏడాది తర్వాత T20 ఇంటర్నేషనల్‌కి తిరిగి వస్తున్నారు. అయితే, తొలి టీ20లో రోహిత్ శర్మ ఆటను చూసే అవకాశం అభిమానులకు మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడని మ్యాచ్‌కు ఒకరోజు ముందు ఆ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలియజేశాడు.

తొలి మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో లేడు..

మ్యాచ్‌కు ఒకరోజు ముందు మొహాలీలో జరిగిన విలేకరుల సమావేశంలో టీమిండియా కోచ్ ద్రవిడ్ మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ తొలి టీ20 మ్యాచ్‌లో ఆడడం లేదని చెప్పుకొచ్చాడు. అయితే రెండో, మూడో టీ20 మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడని సమాచారం. వాస్తవానికి నవంబర్ 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ ఎలాంటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓడిపోయి టీ20 ప్రపంచకప్‌నకు దూరమైంది. అప్పటి నుంచి కోహ్లీ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు.

రోహిత్ జట్టుతో మొహాలీ చేరుకోలే..

గత 14 నెలలుగా ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్న కోహ్లీని చూడాలంటే టీమిండియా అభిమానులు ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కోహ్లీలాగే 14 నెలల తర్వాత ఈ ఫార్మాట్‌లోకి పునరాగమనం చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తొలి మ్యాచ్‌లోనే పునరాగమనం చేయనున్నాడు. అయితే, మ్యాచ్‌కు ఒకరోజు ముందు కూడా రోహిత్ మొహాలీకి రాలేదని వార్తలు వస్తున్నాయి. రోహిత్ జట్టుతో కలిసి మొహాలీకి రాలేదు. కానీ, జనవరి 10 సాయంత్రంలోగా చార్టర్డ్ విమానంలో మొహాలీ చేరుకుంటారని సమాచారం.

ఓపెనర్లపై ద్రావిడ్ ఏమన్నాడంటే..

కోహ్లి అందుబాటులో లేకపోవడం గురించి ద్రవిడ్ మాట్లాడుతూ, కోచ్ ద్రవిడ్ ప్లేయింగ్ ఎలెవన్ గురించి నిర్దిష్ట సమాచారం ఇవ్వలేదు. అయితే, ఈ సిరీస్‌లో రోహిత్‌తో ఎవరు ఓపెనర్‌గా వస్తారో స్పష్టం చేశాడు. ప్రస్తుత జట్టులో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ రూపంలో ఇద్దరు ఓపెనర్లు ఉన్నారు. అయితే తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడని ద్రవిడ్ తెలిపాడు.

టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..