ఆఫ్ఘనిస్థాన్ తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా గురువారం (జనవరి 11) జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో సులువుగా విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున మహ్మద్ నబీ 42 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించినప్పటికీ , నబీ విధ్వంసక బ్యాటింగ్‌తో ఆఫ్ఘన్ జట్టు గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసింది. ఆ తర్వాత మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో వికెట్లు కోల్పోయింది. అయితే శివమ్ దూబే అర్ధ సెంచరీతో పాటు జితేష్ శర్మ, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్‌ల మెరుపు బ్యాటింగ్‌తో 18 ఓవర్లలోనే విజయాన్నిటార్గెట్‌ను ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు శుభారంభం లభించింది. కానీ ఆ జట్టు ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో తడబడింది. 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అక్కడి నుంచి అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌తో కలిసి మహ్మద్ నబీ ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దడంతో జట్టు స్కోరు 100 దాటింది. ఈ సమయంలో మహ్మద్ నబీ చాలా వేగంగా బ్యాటింగ్ చేసి కేవలం 27 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. నబీ మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే ఆఫ్ఘనిస్థాన్ భారత్‌కు మోస్తరు లక్ష్యాన్ని అందించింది. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్‌గా నిలిచాడు. శివమ్ దూబే 2 ఓవర్లలో 9 పరుగులిచ్చి 1 వికెట్ తీయగా, ముఖేష్ కుమార్ కూడా 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అర్షదీప్ తొలి 3 ఓవర్లలో మెయిడిన్‌తో 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే అతని చివరి ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఇక రవి బిష్ణోయ్ 3 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు.
6⃣,4⃣ and Shivam Dube wraps the chase in style 🙌#TeamIndia win by 6 wickets and take a 1-0 lead in the T20I series 👏👏
Scorecard ▶️ https://t.co/BkCq71Zm6G#INDvAFG | @IDFCFIRSTBank | @IamShivamDube pic.twitter.com/4giZma4f1u
— BCCI (@BCCI) January 11, 2024
159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 17.3 ఓవర్లలోనే విజయం సాధించింది. టీమ్ ఇండియా తరఫున శివమ్ దూబే 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 60 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీమ్ ఇండియా విజయంలో శివమ్ దూబే పాత్ర కీలకం. దూబే బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఈ పరుగుల వేటలో టీమిండియాకు పేలవ ఆరంభం లభించింది. భారత్ తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. అలాగే టీమిండియా 28 పరుగుల వద్దే గిల్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అయితే ఇక్కడి నుంచి శివమ్ దూబే, జితేష్ శర్మ, ఆ తర్వాత రింకూ సింగ్ భారత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో పాటు జట్టుకు విజయాన్ని అందించారు. రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.
Launched into the orbit! 🚀
Shivam Dube with a giant MAXIMUM in Mohali 💥
Follow the Match ▶️ https://t.co/BkCq71Zm6G#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @IamShivamDube pic.twitter.com/HxYvyNTn8R
— BCCI (@BCCI) January 11, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..