2021 టీ 20 వరల్డ్ కప్‌లో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడా విజయం సాధించింది. షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని బౌలర్లు భారత్‌ను 151/7కు పరిమితం చేయడంతో 152 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా పాకిస్థాన్ ఛేదించింది. కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో భారత్, పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు బాబర్ అజామ్ టీంను అభినందించారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పాక్ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. మాజీ పేస్ బౌలర్ వసీం అక్రమ్ పాక్ గెలుపుపై ఆనందం వ్యక్తం చేశారు.
Congratulations to the Pakistan Team & esp to Babar Azam who led from the front, as well as to the brilliant performances of Rizwan & Shaheen Afridi. The nation is proud of you all. pic.twitter.com/ygoOVTu37l
— Imran Khan (@ImranKhanPTI) October 24, 2021
Finally the jinx is over winning against India in World Cups. What a thumping win by boys in green… #PakVsInd #PakistanZindabad #T20WorldCup
— Wasim Akram (@wasimakramlive) October 24, 2021
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మ్యాచ్ ముగిసే సమయానికి భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను ఉద్దేశిస్తూ హర్బజన్ సలామ్ క్రికెట్‌లో “పాకిస్తాన్ భారతదేశంతో పోటీ పడటం కనిపించడం లేదు” అని ట్వీ్ట్ చేశాడు. షోయబ్ తరువాత ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. “చివరకు పాకిస్తాన్ గెలిచింది. నేను భారత్ గురించి చెడుగా ఏమీ చెప్పను, మీరు బాగా ఆడారు. కానీ శక్తివంతమైన బాబర్ అజామ్, రిజ్వాన్‌ను ఓడించడానికి సరిపడలేదు. పాకిస్థాన్‌కు శుభాకాంక్షలు” అని ఆయన అన్నారు. హర్భజన్ కూడా పాకిస్తాన్ ఆటగాళ్ల ఆటతీరును మెచ్చుకున్నాడు. ఇండియా తిరిగి పుంజుకుంటుంది అని చెప్పాడు. భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ పాకిస్తాన్ తగిన చోట గెలిచిందన్నాడు.
Kahan ho yaar @harbhajan_singh ??
— Shoaib Akhtar (@shoaib100mph) October 24, 2021
Kya baat hai. MashAllah.
Chhaa gayay. pic.twitter.com/vDPeEePntC— Shoaib Akhtar (@shoaib100mph) October 24, 2021
It wasn’t India’s day today. Am sure they will learn from their mistakes and come back stronger @BCCI But I must compliment Pakistan for their Brilliant win . They were a better team today @TheRealPCB #INDvPAK
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 24, 2021
Give credit where it’s due. Pakistan played better today. It was a complete team effort. As for India nothing is lost there is still time to learn from these mistakes and move forward. #INDvPAK #T20WorldCup
— Mohammed Azharuddin (@azharflicks) October 24, 2021
ఈరోజు భారతదేశానికి కష్టమైన రోజు.. ఇండియా తిరిగి పుంజుకుంటారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను! పాకిస్తాన్‌కు అభినందనలు అంటూ భారత్ మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. వాస్తవానికి మనమందరం నిరాశకు గురయ్యాం కానీ మన ఆశలు ఉన్నత స్థితిలో ఉంచుకుందామని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ట్వీట్ చేశారు.
Tough day for india and @ManUtd I’m sure they will bounce back ! Congratulations to Pakistan and Liverpool ! #timeforbed
— Yuvraj Singh (@YUVSTRONG12) October 24, 2021
Of course all of us are disappointed but let’s keep our hopes and heads high. The World Cup is far from over. Now is the time to regroup and bounce back! #BleedBlue
— parthiv patel (@parthiv9) October 24, 2021
భారత్, పాకిస్థాన్ రెండూ తమ తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడతాయి. పాకిస్తాన్ మంగళవారం న్యూజిలాండ్‌తో తలపడగా, భారత్ తన తదుపరి మ్యాచ్ ఆదివారం ఆడనుంది.
Same celebration, same side, new result. Well done my boys ?#PAKvIND #PakistanZindabad ??#T20WorldCup https://t.co/xndLcPdNfS
— Shahid Afridi (@SAfridiOfficial) October 24, 2021
“Allhamdulilal” Great Win Champs♥️ Nation Is So PROUD Of You Boys??. Convincing Win. So Calm & Calculative. Super Spell @iShaheenAfridi & Rest Of The Bowlers. #OneSidedAfair Well Done @babarazam258 & @iMRizwanPak Outstanding Captaincy #PakistanZindabad #T20WorldCup pic.twitter.com/9TeDwTwX7H
— Waqar Younis (@waqyounis99) October 24, 2021
Read Also.. Ind Vs Pak: మ్యాచ్‌కు ముందు అంతా మనకే అనుకూలం.. కానీ ఆరోజు మనది కాదు..