క్రికెట్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!

IIM Indore Study on Vaibhav Suryavanshi: వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ పిన్న వయసులోనే ఐపీఎల్ వేదికగా అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ కథ, ఇప్పుడు కేవలం ఆటకే పరిమితం కాలేదు. లీడింగ్ మేనేజ్‌మెంట్ సంస్థల పరిశోధనల్లో నిలిచే స్థాయికి చేరింది. ఈ అధ్యయనం ద్వారా వెలుగులోకి వచ్చే విషయాలు క్రీడా ప్రపంచంలో ఒత్తిడిని జయించాలనుకునే ఎంతో మంది యువ క్రీడాకారులకి కొత్త మార్గాన్ని చూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

క్రికెట్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
Iim Indore Study On Vaibhav Suryavanshi

Updated on: Jun 03, 2026 | 11:44 AM

IIM Indore Study on Vaibhav Suryavanshi: ఐపీఎల్ వేదికగా అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్ – ఇండోర్) ప్రత్యేక అధ్యయనం ప్రారంభించింది. చిన్న వయసులోనే అసాధారణ విజయాలు సాధించిన బాల మేధావులపై ఖ్యాతి, అంచనాల ఒత్తిడి ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తికర అంశంపై ఈ పరిశోధన సాగనుంది.

బాల మేధావి ఆట వెనుక ఉన్న రహస్యాలేంటి?

క్రీడల్లోగానీ, ఇతర రంగాల్లోగానీ చాలా చిన్న వయసులోనే కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటారు. అయితే, ఆ వయసులో వచ్చే విపరీతమైన క్రేజ్, సమాజం నుంచి వచ్చే అంచనాలు వారి మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయనేది ఎప్పుడూ పెద్ద ప్రశ్నే. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని ఒక ఉదాహరణగా తీసుకుని ఐఐఎమ్ ఇండోర్ ఈ రహస్యాలను ఛేదించబోతోంది.

ఇది కూడా చదవండి: ఆ అవార్డు వైభవ్‌ది కాదు.. అసలైన అర్హుడు ఆయనే.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

ఇవి కూడా చదవండి

వైభవ్ లాంటి బాల మేధావులు నిరంతరం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు వారిని ప్రేరేపించే అంతర్గత కారకాలు ఏమిటి? వారి రోజువారీ ప్రాక్టీస్ విధానాలు ఎలా ఉంటాయి? మైదానంలోనూ, బయటా వారి మనస్తత్వం ఏ విధంగా పనిచేస్తుంది? అనే కోణాల్లో ఈ అధ్యయనం సాగుతుందని ఐఐఎమ్ వర్గాలు వెల్లడించాయి.

తల్లిదండ్రులు, కోచ్‌ల పాత్రపై ప్రత్యేక దృష్టి..

ఒక సాధారణ బాలుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగడం వెనుక కేవలం సదరు ఆటగాడి శ్రమ మాత్రమే ఉండదు. ఆ ప్రయాణంలో అతడికి అండగా నిలిచే వ్యవస్థ పాత్ర చాలా కీలకం. ఈ పరిశోధనలో భాగంగా వైభవ్ గొప్పగా రాణించేలా అతడి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు ఎలాంటి సహకారాన్ని అందించారనే విషయాన్ని నిశితంగా పరిశీలించనున్నారు.

ఇది కూడా చదవండి: బీసీసీఐ డేంజరస్ నిర్ణయం.. ఆ జోడీతో ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్.. ఇకపై టార్గెట్ పవర్ ప్లేలోనే ఫినిష్..!

విజయం సాధిస్తున్నప్పుడు వచ్చే గుర్తింపును తట్టుకోవడం ఒకెత్తయితే, ఒక దశకు వచ్చిన తర్వాత కెరీర్‌లో ఎదురయ్యే అడ్డంకులను, వైఫల్యాలను ఈ చిన్న వయసులోనే వారు ఎలా ఎదుర్కొంటున్నారనేది ఈ స్టడీలో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారనుంది.

ఐఐఎమ్ డైరెక్టర్ హిమాంశు రాయ్ ఏమన్నారంటే?

ఈ వినూత్న అధ్యయనం గురించి ఐఐఎమ్ ఇండోర్ డైరెక్టర్ హిమాంశు రాయ్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ ఆట తీరు, అతడి మానసిక దృఢత్వం క్రీడా రంగానికే కాకుండా మేనేజ్‌మెంట్ రంగానికి కూడా ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఒత్తిడిని అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలనే అంశంపై ఈ పరిశోధన ద్వారా వచ్చే ఫలితాలు భవిష్యత్తు తరాలకు, ముఖ్యంగా యువ ప్రతిభావంతులకు దిక్సూచిగా మారతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us