IPL 2022: ఉస్మానాబాద్‌కు చెందిన రాజవర్ధన్ హంగర్గేకర్‌పై పెద్ద ఆరోపణ కొనసాగుతోంది. రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ తన వయస్సును దాచిపెట్టాడని క్రీడలు, యువజన కమిషనర్ ఓంప్రకాష్ బకోరియా ఆరోపిస్తున్నారు. దీని గురించి ఐఏఎస్ అధికారి ఓంప్రకాష్ బకోరియా బీసీసీఐకి లేఖ పంపారు. రాజ్‌వర్ధన్ హంగర్గేకర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం కూడా ఉన్నట్లు తెలిపారు. మీడియా నివేదికల ప్రకారం.. రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ నిజమైన వయస్సు 21 సంవత్సరాలు. కానీ తన వయస్సును దాచిపెట్టి అతను అండర్-19 ప్రపంచ కప్‌లో ఆడాడు. జట్టు విజయంలో రాజవర్ధన్ కీలకపాత్ర పోషించాడు. టీం ఇండియా ఇంగ్లండ్‌ను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. 2017-18లో ప్రపంచకప్ గెలిచిన జట్టు ఓపెనర్ మంజోత్ కల్రా కూడా వయసు వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై ఏడాది పాటు నిషేధం విధించారు.
విచారణలో దోషులుగా తేలితే?
బీసీసీఐ విచారణలో హంగర్‌గేకర్ దోషిగా తేలితే అతడిపై నిషేధం విధించే అవకాశం ఉంది. అదే జరిగితే హంగర్‌గేకర్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లే. ఐపీఎల్-2022 గ్రాండ్ వేలంలో రాజవర్ధన్ బేస్ ధర రూ.30 లక్షలు. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ రూ.1.50 కోట్లకు తమ జట్టులో చేర్చుకుంది. ముంబై ఇండియన్స్ కూడా ఈ ఆటగాడి కోసం వేలం వేసింది. అయితే చెన్నై, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడిపై మరింత విశ్వాసం ప్రదర్శించాయి. ఈ రెండు జట్లు పోటీ పడగా చివరకి చెన్నై రూ.1.50 కోట్లకు దక్కించుకుంది. వయసును దాచిపెట్టారనే ఆరోపణ రుజువైతే రాజవర్ధన్ ఐపీఎల్ కాంట్రాక్ట్ కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది.
సరైన వయసు ఎంత..?
రాజవర్ధన్ ధారాశివ్‌లోని టెర్నా పబ్లిక్ స్కూల్ విద్యార్థి. పాఠశాల రికార్డుల ప్రకారం హంగర్‌గేకర్ జనవరి 10, 2001న జన్మించాడు. కానీ VIIIలో కొత్త అడ్మిషన్ ఇస్తున్నప్పుడు ప్రధానోపాధ్యాయుడు అనధికారికంగా రాజవర్ధన్ పుట్టిన తేదీని 10 నవంబర్ 2002కి మార్చారు. జనవరి 14, ఫిబ్రవరి 5 మధ్య జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో రాజ్‌వర్ధన్ హంగర్గేకర్‌కు 21 సంవత్సరాలు. రాజవర్ధన్ హంగర్గేకర్ వయస్సు వివాదంలో దోషిగా తేలితే అతని ఐపిఎల్ కాంట్రాక్ట్ రద్దు చేస్తారు.