Rishabh Pant : మరో ముప్పై నిమిషాలు క్రీజులో ఉంటే ఫలితం మరోలా ఉండేది.. సిడ్ని టెస్ట్‌పై రిషభ్ పంత్ కామెంట్స్..

Rishabh Pant Coments: సిడ్ని టెస్ట్‌పై వికెట్‌కీపర్ రిషభ్‌ పంత్ తన స్పందనను తెలియజేశాడు. తాను మరో ముప్పై నిమిషాలు క్రీజులో ఉంటే ఫలితం మరోలా

Rishabh Pant : మరో ముప్పై నిమిషాలు క్రీజులో ఉంటే ఫలితం మరోలా ఉండేది.. సిడ్ని టెస్ట్‌పై రిషభ్ పంత్ కామెంట్స్..

Updated on: Jan 26, 2021 | 5:17 AM

Rishabh Pant Coments: సిడ్ని టెస్ట్‌పై వికెట్‌కీపర్ రిషభ్‌ పంత్ తన స్పందనను తెలియజేశాడు. తాను మరో ముప్పై నిమిషాలు క్రీజులో ఉంటే ఫలితం మరోలా ఉండేదని వ్యాఖ్యానించాడు. ఓ స్పోర్ట్స్‌ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సిడ్నీ టెస్టులో అనవసరంగా శతకం కోల్పోయానని, మరో 30 నిమిషాలు లేదా గంట సేపు క్రీజులో ఉంటే మరో విజయం సాధించేవాళ్లమని అన్నాడు.

ఆ సమయంలో గెలవడానికి అవకాశాలు ఉన్నాయని, అయితే అన్నిసార్లు అలాంటి అవకాశాలు రావని చెప్పాడు. కానీ తర్వాత మ్యాచ్‌లోనే నాకు ఈ అవకాశం వచ్చిందని అందుకే జట్టును గెలిపించాలని భావించి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచి విజయం సాధించానని చెప్పుకొచ్చాడు. సిడ్నీ టెస్టులో పంత్‌ 97 పరుగులు సాధించాడు. అయితే అతడు క్రీజులో ఉన్నంతసేపు భారత్‌ ఫేవరేట్‌గా నిలిచింది కానీ అతడు ఔటైన తర్వాత మ్యాచ్ పరిస్థితి మారిపోయిన సంగతి తెలిసిందే.

కుంభమేళాకు వచ్చే భక్తులకు కేంద్రం కొత్త నిబంధన.. ఆ రిపోర్ట్ లేకుండా అనుమతి నిరాకరణ.. కచ్చితంగా పాటించాలని సూచన..