ఎందుకా జట్టు..? రద్దు చేస్తే బెటర్: కోర్టులో పిటిషన్

ప్రపంచ వరల్డ్‌కప్‌లో భాగంగా ఇటీవల భారత్‌- పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 89 పరుగుల తేడాతో తమ చిరకాల ప్రత్యర్థిని ఓడించింది భారత సేన. అయితే ఈ ఓటమిని పాక్ దేశీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పాక్‌ క్రికెట్ టీమ్‌ను బహిష్కరించండి అంటూ గుజ్రన్‌వాలా సివిల్ కోర్టులో ఓ క్రికెట్ అభిమాని పిటిషన్ దాఖలు చేశారు. అలాగే పాకిస్తాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీని కూడా ప్రక్షాళన చేయాలంటూ ఆ […]

ఎందుకా జట్టు..? రద్దు చేస్తే బెటర్: కోర్టులో పిటిషన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 19, 2019 | 12:10 PM

ప్రపంచ వరల్డ్‌కప్‌లో భాగంగా ఇటీవల భారత్‌- పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 89 పరుగుల తేడాతో తమ చిరకాల ప్రత్యర్థిని ఓడించింది భారత సేన. అయితే ఈ ఓటమిని పాక్ దేశీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పాక్‌ క్రికెట్ టీమ్‌ను బహిష్కరించండి అంటూ గుజ్రన్‌వాలా సివిల్ కోర్టులో ఓ క్రికెట్ అభిమాని పిటిషన్ దాఖలు చేశారు. అలాగే పాకిస్తాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీని కూడా ప్రక్షాళన చేయాలంటూ ఆ వ్యక్తి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ప్రపంచ కప్‌లో పాక్ పేలవమైన ప్రదర్శననిస్తోంది. ఇప్పటివరకు 5 ఆటలను ఆడిన పాక్ అందులో ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ గవర్నింగ్ బోర్డు బుధవారం సమావేశం కానున్నట్లు ఓ న్యూస్ చానెల్ పేర్కొంది. ఈ సమావేశంలో పాకిస్తాన్ టీమ్‌లో భారీ మార్పులు చేసేలా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోచ్ సహా, టీమ్ మేనేజర్, బౌలింగ్ కోచ్‌లను మార్చాలని భావిస్తున్నట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.