IND vs PAK : సందర్భం ఏదైనా సరే.. వారితో చేతులు కలిపే ప్రసక్తే లేదు..బీసీసీఐ సంచలన నిర్ణయం

గత మూడు ఆదివారాలుగా ఏషియా కప్ 2025లో భారత్, పాక్ పురుషుల మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు మరో ఆదివారం,ఈసారి మహిళా క్రికెట్‌లో ఇదే ఉత్కంఠను రేపే మరో మ్యాచ్ జరగబోతోంది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

IND vs PAK : సందర్భం ఏదైనా సరే.. వారితో చేతులు కలిపే ప్రసక్తే లేదు..బీసీసీఐ సంచలన నిర్ణయం
Icc World Cup

Updated on: Oct 02, 2025 | 12:30 PM

IND vs PAK : గత మూడు ఆదివారాలుగా ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ పురుషుల మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు మరో ఆదివారం, ఇదే ఉత్కంఠను రేపే మరో మ్యాచ్ జరగబోతోంది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే, పురుషుల జట్టు మాదిరిగానే మహిళా జట్టు కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు, పీసీబీ అధికారులతో చేతులు కలపదా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఈ విషయమై ఒక సంచలన వార్త బయటికొచ్చింది.

గత మూడు ఆదివారాలుగా ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ పురుషుల మ్యాచ్‌లు ఎంత ఉత్కంఠగా జరిగాయో తెలిసిందే. ఇప్పుడు మరోసారి, అక్టోబర్ 5వ తేదీన ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో ఈ రెండు దేశాల మహిళా జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌కి ముందు ఒక సంచలన వార్త వెలువడింది. పురుషుల జట్టు తరహాలోనే మహిళా జట్టు కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు, పీసీబీ అధికారులతో చేతులు కలపదని తెలుస్తోంది.

ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ ఆగాతో చేతులు కలపలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపలేదు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. సూపర్-4, ఫైనల్ మ్యాచ్‌లలో కూడా భారత జట్టు ఇదే విధానాన్ని అనుసరించింది. దీనికి కొనసాగింపుగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ భారత్ గెలిచిన ట్రోఫీని తనతో తీసుకెళ్లిపోయాడు.

మీడియా నివేదికల ప్రకారం బీసీసీఐ అధికారి ఒకరు పేరు చెప్పడానికి ఇష్టపడకుండా మాట్లాడుతూ, ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా బోర్డు వ్యవహరిస్తుందని తెలిపారు. అందువల్ల టాస్ సమయంలో చేతులు కలిపే సంప్రదాయం ఉండదు, మ్యాచ్ రెఫరీతో ఎలాంటి ఫోటోషూట్ ఉండదు, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా చేతులు కలిపే విధానం ఉండదు. పురుషుల జట్టు ఏ విధానాన్ని అనుసరించిందో, మహిళల జట్టు కూడా అదే చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

భారత మహిళా క్రికెట్ జట్టు, పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. పాకిస్తాన్ తమ అన్ని మ్యాచ్‌లను ఇదే గ్రౌండ్‌లో ఆడనుంది. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకుంటే, అది కూడా ఇదే గ్రౌండ్‌లో జరుగుతుంది. అక్టోబర్ 5న ఈ రెండు జట్లు తలపడినప్పుడు, ఆటగాళ్ల ప్రవర్తనపై అందరి దృష్టి ఉంటుంది. ఆటగాళ్లపై దీని ఒత్తిడి ఉండవచ్చు, అయితే టీమ్ మేనేజ్‌మెంట్ దీని ప్రభావం ఆటగాళ్లపై పడకూడదని కోరుకుంటుంది. టాస్ తర్వాత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా మధ్య మాటలు లేదా షేక్‌హ్యాండ్ ఉండే అవకాశం దాదాపు సున్నా అని చెప్పవచ్చు.

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 తొలి మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించి విజయంతో టోర్నమెంట్‌ను ప్రారంభించింది. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో, భారత్ 269 పరుగులు చేసింది. శ్రీలంక జట్టు 211 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీప్తి శర్మ 53 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టింది. ఆమె అద్భుతమైన ఆల్‌రౌండర్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..