ODI World Cup: భారత్‌లో వన్డే వరల్డ్‌కప్.. ప్రారంభమయ్యేది ఆరోజే.. ఫైనల్ ఎప్పుడంటే.!

|

Mar 22, 2023 | 1:30 PM

మరికొద్ది నెలల్లో వన్డే ప్రపంచకప్‌కి భారత్ ఆతిధ్యమివ్వనుంది. ఈ టోర్నీకి సంబంధించి తేదీలు ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల దుబాయ్‌లో..

ODI World Cup: భారత్‌లో వన్డే వరల్డ్‌కప్.. ప్రారంభమయ్యేది ఆరోజే.. ఫైనల్ ఎప్పుడంటే.!
Follow us on

మరికొద్ది నెలల్లో వన్డే ప్రపంచకప్‌కి భారత్ ఆతిధ్యమివ్వనుంది. ఈ టోర్నీకి సంబంధించి తేదీలు ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ సమావేశంలో బీసీసీఐ ఆయా తేదీలను చెప్పిందని సమాచారం. అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రపంచకప్ ట్రోఫీ ప్రారంభం కానుండగా.. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్ జరగనుందట. మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 10 జట్లు సుమారు 48 మ్యాచ్‌ల్లో తలబడనున్నాయి.

ఇక వేదికల విషయానికొస్తే.. అహ్మదాబాద్‌తో పాటు మరో 11 నగరాలను బీసీసీఐ షార్ట్ లిస్టు చేసిందని తెలుస్తోంది. ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్‌ ఈ జాబితాలో ఉన్నాయి. కాగా, ఈ షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి వివరాలను బీసీసీఐ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. మరోవైపు 2011లో చివరిసారిగా భారత్‌లో వన్డే వరల్డ్‌కప్ జరిగింది. ఈ టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి టీమిండియా విజేతగా నిలిచింది.