2023 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఐదో విజయాన్ని నమోదు చేసింది. చెన్నై వేదికగా శుక్రవారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కేవలం ఒక వికెట్ తేడాతో పాక్‌ను ఓడించింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 270 పరుగులు మాత్రమే చేయగలిగింది. దక్షిణాఫ్రికా తరఫున తబ్రేజ్ షమ్సీ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఐడెన్ మార్క్రామ్ మూలస్తంభంగా నిలిచాడు. 93 బంతుల్లో 91 పరుగులు చేసి 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఆఖరులో వరుసగా వికెట్లు తీసి ప్రొటీస్‌కు ఝలక్ ఇచ్చారు పాక్ బౌలర్లు. పరుగులు కూడా రాకపోవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. అయితే కేశవ్ మహరాజ్ (21 బంతుల్లో 7 పరుగులు), తబ్రేజ్ షమ్సీ అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ జట్టు ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. బాబర్ 65 బంతుల్లో 50 పరుగులు చేయగా, రిజ్వాన్ పెద్దగా షాట్లు ఆడలేకపోయాడు. ఆ తర్వాత సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్ బ్యాటింగ్‌కు దిగారు. సౌద్ షకీల్ 52 బంతుల్లో 52 పరుగులు, షాదాబ్ ఖాన్ 36 బంతుల్లో 43 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా తరఫున తబ్రేజ్ షమ్సీ 4 వికెట్లు, మార్కో జాన్సెన్ 3 వికెట్లు, గెరాల్డ్ కోయెట్జీ 2 వికెట్లు, లుంగి ఎన్గిడి ఒక వికెట్ తీశారు.
271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 34 పరుగుల వద్ద తొలి దెబ్బ తగిలింది. క్వింటన్ డి కాక్ 24 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత టెంబా బావుమా 28 పరుగులు చేసి టెన్త్‌లోకి వచ్చాడు. రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్ కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. అతను 21 పరుగుల వద్ద ఔటయ్యాడు. కానీ జట్టు తరఫున ఒంటరి పోరాటం చేసిన ఐడెన్ మార్క్రామ్ 93 బంతుల్లో 91 పరుగులు చేసి 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. డేవిడ్ మిల్లర్ కూడా మార్క్‌రామ్‌తో కలిసి మంచి ఇన్నింగ్స్‌ను ఆడాడు. అయితే ఈ రెండు వికెట్ల పతనం తర్వాత ఆఫ్రికా ఓటమి అంచున నిలిచింది. ఆఫ్రికన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు సఫలమయ్యారు. అయితే ఎంతో ఒత్తిడిలో కేశవ్ మహరాజ్ బౌండరీ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..