ఏడేళ్ల తర్వాత.. భారత గడ్డపై అడుగుమోపింది పాకిస్తాన్ జట్టు. బాబర్ అజామ్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడుకున్న పాకిస్తాన్ క్రికెట్ బృందం దుబాయ్ నుంచి నేరుగా బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో వన్డే ప్రపంచకప్ మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనుంది పాకిస్తాన్.
సమయం ఆసన్నమైంది.. మరో వారం రోజుల్లో వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభమవుతుంది. పది జట్లు హోరాహోరీగా తలబడే ఈ మెగా టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌లో గతేడాది వరల్డ్‌కప్ ఫైనలిస్ట్‌లైన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక ఇప్పటికే జట్లన్నీ కూడా ఇండియా చేరుకున్నాయి. మెగా టోర్నమెంట్‌కు ముందుగా ప్రతీ జట్టు రెండేసి వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో భాగంగానే దాయాది పాకిస్తాన్ జట్టు కూడా సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది.
బాబర్ ఆజామ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. ఆ జట్టు ఇక్కడే రెండు వారాల పాటు ఉండబోతోంది. సెప్టెంబర్ 29(న్యూజిలాండ్), అక్టోబర్ 3(ఆస్ట్రేలియా) రెండు వార్మప్ మ్యాచ్‌లు.. లీగ్ ప్రారంభమైన అనంతరం అక్టోబర్ 6(నెదర్లాండ్స్), అక్టోబర్ 10(శ్రీలంక)న రెండు ప్రధాన మ్యాచ్‌లు ఆడనుంది పాకిస్తాన్ జట్టు.
శంషాబాద్ విమానాశ్రయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఘన స్వాగతం పలికారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు. ఎయిర్‌పోర్ట్ నుంచి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్ వరకు పటిష్ట భద్రత నడుమ నగర పోలీసులు పాక్ జట్టును తరలించారు. మొహమ్మద్ నవాజ్, అగ సల్మాన్ తప్ప.. మిగిలిన పాక్ సభ్యులకు భారత్ రావడం ఇదే మొదటిసారి. దీంతో వారికి ఇక్కడ లభించిన మర్యాద చూసి ఉబ్బితబ్బిబైపోయారు పాక్ క్రికెటర్లు.
ఇక హైదరాబాద్‌లో తమకు లభించిన సాదర స్వాగతానికి మైమరిచిపోయిన పాకిస్తాన్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన స్పందన తెలియజేశాడు. ‘గొప్ప సాదర స్వాగతం ఇంతవరకు’ అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. కాగా, ఈ ఇన్‌స్టా స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిపై ఓ లుక్కేయండి.
ఒక్క షాహీన్ షా అఫ్రిది మాత్రమే కాదు.. అతడి సహచర ఆటగాడైన మహమ్మద్ నవాజ్ కూడా ఘన స్వాగతానికి.. సంబరపడిపోయి తన స్పందన సోషల్ మీడియాలో తెలియజేశాడు. అలాగే మన ఫ్యాన్స్ కూడా శంషాబాద్ విమానాశ్రయంలో క్రికెటర్లను సాదర స్వాగతం పలికారు. ఆ వీడియోలను చూసేయండి.
Amazing reception from the people here. Everything was super smooth. Looking forward to the next 1.5 months 😇
— Muhammad Rizwan (@iMRizwanPak) September 27, 2023
Pakistan cricket team in Hyderabad
Look at their gestures 👇 pic.twitter.com/qZcRi9Ehuv— mukarram (@mukarram3) September 27, 2023
Thanks to Indians for a warm welcome of Pakistan Cricket Team 🇵🇰
That was totally unexpected & so mesmerising 😭❤️ #Hyderabad pic.twitter.com/DqBZxgBtKQ— SAAD 🇵🇰 (@SaadIrfan258) September 27, 2023
A warm welcome in Hyderabad as we land on Indian shores 👏#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/poyWmFYIwK
— Pakistan Cricket (@TheRealPCB) September 27, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..