శుక్రవారం శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో సఫారీలు విజయం సాధించారు. మొదటి బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణేత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్ఠానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (88; 69 బంతుల్లో 7×4, 4×6), హషీమ్ ఆమ్లా (65; 61 బంతుల్లో 9×4) రాణించారు. లంక బౌలర్లలో లక్మల్, ప్రదీప్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. సిల్వా, మెండిస్ చెరో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన శ్రీలంక.. సఫారీ బౌలర్లు ఫెలుక్వాయో (4/36), ఎంగిడి (2/12) ధాటికి 42.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కరుణరత్నే (87; 92 బంతుల్లో 12×4), ఏంజెలో మాథ్యూస్ (64; 66 బంతుల్లో 6×4, 1×6) మాత్రమే పోరాడారు.