ఇవాళ్టి మ్యాచ్‌లో ‘టాసే’ కీలకం : కోహ్లీ

| Edited By:

Jul 09, 2019 | 7:57 AM

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా విజయ పరంపర కొనసాగిస్తోంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీలు, బౌలర్లు విజృంభన, కొహ్లీ సమర్థవంతమైన ఫీల్డింగ్‌తో.. టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే.. ఈ సంద్భంగా టీమిండియా విజయ సారథి కెప్టెన్ విరాట్ కొహ్లీ మాట్లాడుతూ.. నేడు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో టాసే కీలకమని అన్నారు. టాస్ మనం గెలిస్తే.. న్యూజిలాండ్‌ని కొంచెం కట్టడి చెయొచ్చని చెప్పాడు. న్యూజిలాండ్ బలమైన జట్టు అని.. ఆ జట్టుకు […]

ఇవాళ్టి మ్యాచ్‌లో టాసే కీలకం : కోహ్లీ
Follow us on

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా విజయ పరంపర కొనసాగిస్తోంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీలు, బౌలర్లు విజృంభన, కొహ్లీ సమర్థవంతమైన ఫీల్డింగ్‌తో.. టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే.. ఈ సంద్భంగా టీమిండియా విజయ సారథి కెప్టెన్ విరాట్ కొహ్లీ మాట్లాడుతూ.. నేడు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో టాసే కీలకమని అన్నారు. టాస్ మనం గెలిస్తే.. న్యూజిలాండ్‌ని కొంచెం కట్టడి చెయొచ్చని చెప్పాడు. న్యూజిలాండ్ బలమైన జట్టు అని.. ఆ జట్టుకు ప్రధాన బలం బౌలింగ్‌నేని అన్నారు. అయినా.. సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్యం టీమిండియాకు ఉందని తెలిపాడు. అయితే.. జట్టు సెమీస్‌కు చేరడంతో కాస్త ప్రశాంతంగా ఉందని చెప్పాడు కొహ్లీ.

కాగా.. ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకూ లీగ్ దశలో భారత్ 7 విజయాలను కైవసం చేసుకుంది.

అయితే.. టీమిండియా గనుక న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్లో‌ అడుగు పెట్టి, ఇంగ్లండ్‌ను వారి సొంత గడ్డపై ఓడిస్తే.. గనుక అరుదైన రికార్డును సాధించినట్టే. వరల్డ్ కప్ చరిత్రలో అన్ని జట్లపై గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టిస్తుంది.