చిత్తు చిత్తుగా ఓడిన ఆసీస్.. ఫైనల్స్‌లోకి ఇంగ్లాండ్

| Edited By: Srinu

Jul 12, 2019 | 1:36 PM

ఐసీసీ ప్రపంచ కప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రెండవ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఇంగ్లాండ్ ముందు 224 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. లక్ష్యాన్ని అవలీలగా చేధించి.. ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేశారు. స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. […]

చిత్తు చిత్తుగా ఓడిన ఆసీస్.. ఫైనల్స్‌లోకి ఇంగ్లాండ్
Follow us on

ఐసీసీ ప్రపంచ కప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రెండవ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఇంగ్లాండ్ ముందు 224 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. లక్ష్యాన్ని అవలీలగా చేధించి.. ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేశారు. స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. బ్యాటింగ్‌లో బోల్తా పడిన కంగారూలు బౌలింగ్‌లోనూ పేలవ ప్రదర్శన చేశారు. జేసన్ రాయ్ 85 పరుగులతో అద్భుతమైన ఆరంభం అందించగా.. కెప్టెన్ మోర్గన్, జో రూట్‌లు దూకుడైన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో ఇంగ్లండ్ కేవలం 32.1 ఓవర్లలో 226 పరుగులు చేసి ఆసీస్‌ని చిత్తుగా ఓడించి రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన.. క్రిస్ వోక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.