నా జీవితాంతం విలియమ్‌సన్‌కు సారీ చెబుతూనే ఉంటా- బెన్ స్టోక్స్

|

Jul 15, 2019 | 11:51 AM

‘మ్యాచ్‌లో చోటు చేసుకున్న కొన్ని అంశాలు న్యూజిలాండ్‌కు దురదృష్టకర పరిణామాలుగా మారాయి. స్టోక్స్‌ రన్ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి గప్టిల్‌ త్రో విసిరాడు. అయితే క్రీజును చేరేందుకు దూకిన స్టోక్స్‌ బ్యాటును తాకి ఓవర్‌ త్రో రూపంలో బౌండరీకి వెళ్లిపోయి ఆరు పరుగులు రావడం ఇంగ్లండ్‌కు కలిసివచ్చింది. ఇలాంటి సంఘటనలు జరిగి ఉండాల్సింది కాదు. ఏది ఏమైనా ఈ ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’ ఇవి వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ […]

నా జీవితాంతం విలియమ్‌సన్‌కు సారీ చెబుతూనే ఉంటా- బెన్ స్టోక్స్
Follow us on

‘మ్యాచ్‌లో చోటు చేసుకున్న కొన్ని అంశాలు న్యూజిలాండ్‌కు దురదృష్టకర పరిణామాలుగా మారాయి. స్టోక్స్‌ రన్ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి గప్టిల్‌ త్రో విసిరాడు. అయితే క్రీజును చేరేందుకు దూకిన స్టోక్స్‌ బ్యాటును తాకి ఓవర్‌ త్రో రూపంలో బౌండరీకి వెళ్లిపోయి ఆరు పరుగులు రావడం ఇంగ్లండ్‌కు కలిసివచ్చింది. ఇలాంటి సంఘటనలు జరిగి ఉండాల్సింది కాదు. ఏది ఏమైనా ఈ ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’ ఇవి వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అన్న మాటలు.

ఫైనల్ పోరులో తన అసాధరాణ పోరాటపటిమతో న్యూజీల్యాండ్ విజయానికి అడ్డుకట్టవేసిన బెన్ స్టోక్స్‌ వాస్తవానికి పుట్టుకతో న్యూజీల్యాండర్. అక్కడే క్రైస్ట్‌చర్చ్‌లో పుట్టిన ఈ ఆటగాదు 12 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఇంగ్లండ్‌కు వలస వచ్చాడు. ఇక్కడే క్రికెట్ కోచింగ్ తీసుకోని.. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి.. గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకున్నాడు.

అయితే గుప్తిల్ విసిరిన త్రో..స్టోక్స్ బ్యాటుకు తగిలి ఫోర్ వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ 4 పరుగులు న్యూజిలాండ్ ఓటిమికి మేజర్ కారణమయ్యాయి. అయితే ఈ సంఘటనపై  మ్యాచ్ అనంతరం స్టోక్స్ మాట్లాడాడు. తాను కావాలని ఆ విధంగా చెయ్యలేదని..యాదృచ్చికంగా జరిగిందని..ఆ ఇన్సిడెంట్ పట్ల జీవితాతం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌కి క్షమాపణ చెబుతూనే ఉంటానని పేర్కొన్నాడు.