భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ను ఎంతమంది చూశారో తెలుసా..?

| Edited By:

Jun 17, 2019 | 9:55 AM

ప్రపంచకప్ 2019లో భాగంగా దాయాది దేశాల మధ్య సాగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 89 పరుగుల తేడాతో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించిన భారత్.. పాయింట్‌ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే వరుణుడి దోబూచులాట నేపథ్యంలో సాగిన ఈ మ్యాచ్‌ను ప్రపంచవాప్తంగా కొన్ని బిలియన్ల మంది వీక్షించారు. కాగా కేవలం ఓ ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లో ఈ మ్యాచ్‌ను 15.5మిలియన్ మంది చూసినట్లు తెలిసింది. ఇది న్యూజిలాండ్ జనాభా కంటే రెట్టింపు […]

భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ను ఎంతమంది చూశారో తెలుసా..?
Follow us on

ప్రపంచకప్ 2019లో భాగంగా దాయాది దేశాల మధ్య సాగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 89 పరుగుల తేడాతో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించిన భారత్.. పాయింట్‌ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే వరుణుడి దోబూచులాట నేపథ్యంలో సాగిన ఈ మ్యాచ్‌ను ప్రపంచవాప్తంగా కొన్ని బిలియన్ల మంది వీక్షించారు. కాగా కేవలం ఓ ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లో ఈ మ్యాచ్‌ను 15.5మిలియన్ మంది చూసినట్లు తెలిసింది. ఇది న్యూజిలాండ్ జనాభా కంటే రెట్టింపు సంఖ్య అని.. స్ట్రీమింగ్‌ యాప్‌లో రికార్డని సమాచారం.

మ్యాచ్‌ ప్రారంభమైనప్పుడు తక్కువగానే ఉన్నప్పటికీ.. ఆ తరువాత వీక్షకులు పెరుగుతూ వెళ్లగా.. ఇక ఫైనల్‌లో మొత్తం 15.5మిలియన్ మంది లైవ్‌ను చూశారు. హాస్టల్‌ల్లో ఉన్న విద్యార్థులు, క్యాబ్‌ డ్రైవర్లు ఇలా టీవీ తమకు అందుబాటులో లేని వారందరూ ప్రైవేట్ స్ట్రీమింగ్ యాప్‌లో లైవ్‌ను వీక్షించినట్లు తెలుస్తోంది. దీనిపై ఓ కమ్యూనికేషన్ రీసెర్చర్ హిమబిందు చింతకుంట మాట్లాడుతూ.. అందరి దగ్గరా స్మార్ట్‌ఫోన్‌లు ఉండటం, డేటా తక్కువ ఖరీదుకే వస్తుంటడంతో.. డిజిటల్ స్ట్రీమింగ్ యాప్‌లలో మ్యాచ్‌‌ను చూసేవారి సంఖ్య పెరిగిందని అన్నారు. అయితే కేవలం డిజిటల్‌లోనే ఇంతమంది ఉంటే.. మిగిలిన మాధ్యమాల ద్వారా ఎంతమంది భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ను చూశారో తెలియాల్సి ఉంది.