ICC Under 19 World Cup: 11 సిక్స్‌లు, 20 ఫోర్లు, 278 పరుగులు.. విండీస్‌తో వార్మప్‌లో అదరగొట్టిన భారత్..!

|

Jan 10, 2022 | 10:29 AM

ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున 11 సిక్సర్లు, 20 ఫోర్లు నమోదయ్యాయి. ఇది వెస్టిండీస్ బౌండరీల కంటే మూడు రెట్లు ఎక్కువ. ఈ మ్యాచ్‌లో రెండు జట్ల మధ్య పెద్ద వ్యత్యాసాన్ని..

ICC Under 19 World Cup: 11 సిక్స్‌లు, 20 ఫోర్లు, 278 పరుగులు.. విండీస్‌తో వార్మప్‌లో అదరగొట్టిన భారత్..!
Icc Under 19 World Cup
Follow us on

India U-19 Team: U19 ప్రపంచ కప్ జనవరి 14 నుంచి ప్రారంభమవనుంది. టోర్నమెంట్‌లో ప్రస్తుతం వార్మాప్ మ్యాచులు జరుగుతున్నాయి. అయితే ఆదివారం మ్యాచులో టీమిండియా తన సత్తా చాటింది. తమ తొలి వార్మప్‌లో భారత అండర్-19 జట్టు వెస్టిండీస్‌తో తలపడింది. 4-సార్లు ఛాంపియన్ వార్మప్‌లో దుమ్మురేపింది. భారత్ ఇన్నింగ్స్ ఫోర్లు, సిక్సర్లతో నిండిపోయింది. ప్రతి క్రీడాకారుడు తన పాత్రను చక్కగా పోషించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 278 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున 11 సిక్సర్లు, 20 ఫోర్లు బాదింది. వెస్టిండీస్ బౌండరీల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువగా ఉండడం విశేషం. ఇది మ్యాచ్‌లో రెండు జట్ల మధ్య పెద్ద వ్యత్యాసాన్ని సృష్టించడానికి పనిచేసింది.

కెప్టెన్ ధుల్, సింధు అద్భుత ఇన్నింగ్స్..
అయితే భారత బ్యాటింగ్‌కు ఆరంభం అంతగా లభించలేదు. ఓపెనర్లు హర్నూర్, రఘువంశీ ఇద్దరూ కేవలం 17 పరుగులు మాత్రమే చేశారు. అయితే దీని తర్వాత కెప్టెన్ యశ్ ధుల్ జట్టును ముందుండి నడిపించడం ప్రారంభించాడు. షాహిక్ రషీద్‌తో కలిసి మూడో వికెట్‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. కెప్టెన్ ధుల్ 67 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. భారత జట్టు తరఫున ఆరాధ్య యాదవ్ 42 బంతుల్లో 5 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. 76 బంతుల్లో 78 పరుగులు చేసిన నిశాంత్ సింధు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సింధు ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి.

వెస్టిండీస్ 43 ఓవర్లలో 108కే ఆలౌట్..
భారత్ నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. కరీబియన్ జట్టు కేవలం 43 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ నందు 52 పరుగులు చేసిన జట్టులో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను తప్ప మరే బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీని దాటలేకపోయాడు. ఫలితంగా వెస్టిండీస్ 108 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్ మొదటి వార్మప్‌లో బౌలర్లు కూడా సత్తా చాటారు. మానవ్ ప్రకాష్, కౌశల్ తాంబే తలో 3 వికెట్లు పడగొట్టగా, గార్గ్ సాంగ్వాన్, అనీశ్వర్ గౌతమ్ చెరో 2 వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించారు.

Also Read: IND VS SA: 11 మంది ఆటగాళ్లలో 5గురు ఫ్లాప్.. ఆశలన్నీ బుమ్రా-షమీలపైనే.. రేపటి నుంచే కేప్‌టౌన్ టెస్ట్..!

IND vs SA: కేప్‌‌టౌన్‌‌లో ఉద్వేగానికి లోనైన భారత స్టార్ బౌలర్.. ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ ట్వీట్..!