U19 World Cup 2022 Final, Ind vs Eng: టీమిండియా బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ విలవిల.. వరుసగా వికెట్లు డౌన్..

|

Feb 05, 2022 | 8:03 PM

IND vs ENG: టోర్నీలో భారత జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటి వరకు నాలుగు సార్లు టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. టీమిండియా ఫైనల్‌కు చేరడం వరుసగా ఇది నాలుగోసారి.

U19 World Cup 2022 Final, Ind vs Eng: టీమిండియా బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ విలవిల.. వరుసగా వికెట్లు డౌన్..
Ind U19 Vs Eng U19
Follow us on

ICC U19 World Cup 2022: అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌పై ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 13 ఓవర్ల వరకు ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. జేమ్స్ రెవ్ (13) క్రీజులో ఉన్నాడు. భారత్ తరఫున రాజ్ బావా ఇప్పటి వరకు మూడు వికెట్లు పడగొట్టాడు. రవికుమార్‌కు రెండు వికెట్లు పడగొట్టాడు. టీమిండియా బౌలింగ్ దెబ్బకు ఇంగ్లండ్ టీం వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో కూరకపోతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు పేలవమైన ఆరంభం లభించగా, రెండో ఓవర్‌లో రవికుమార్ బౌలింగ్‌లో జాకబ్ బెతెల్ (2) ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. తన తర్వాతి ఓవర్‌లోనే కెప్టెన్ టామ్ పెర్స్ట్ (0)ని క్లీన్ బౌల్డ్ చేసి రవి భారత్‌కు రెండో విజయాన్ని అందించాడు. జార్జ్ థామస్ (27) స్కోరు వద్ద ఔటయ్యాడు. ఆ తరువాత రాజ్ బావ బౌలింగ్‌లో విలియం లక్స్టన్ (4) వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ బానాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాతి బంతికే జార్జ్ బెల్ (0)ని కూడా బావా పెవిలియన్ బాట పట్టించాడు.

టోర్నీలో భారత జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటి వరకు నాలుగు సార్లు టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. టీమిండియా ఫైనల్‌కు చేరడం వరుసగా ఇది నాలుగోసారి. 2016లో వెస్టిండీస్‌పై, 2020లో బంగ్లాదేశ్‌పై ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఇంగ్లండ్ ప్లేయింగ్ XI : జార్జ్ థామస్, జాకబ్ బెతెల్, టామ్ ప్రెస్, జేమ్స్ ర్యూ, విలియం లిక్స్టన్, జార్జ్ బెల్, రెహాన్ అహ్మద్, అలెక్స్ హోర్టన్, జేమ్స్ సేల్స్, థామస్ ఆస్పిన్‌వాల్, జాషువా బోడెన్

భారత ప్లేయింగ్ XI – అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్ సింగ్, షేక్ రషీద్, యశ్ ధుల్, నిశాంత్ సింధు, రాజ్యవర్ధన్ హనర్గేకర్, దినేష్ బానా, కౌశల్ తాంబే, రాజ్ బావా, విక్కీ ఓస్త్వాల్, రవి కుమార్

Also Read: