ICC T20 World Cup: షాకిచ్చిన బీసీసీఐ.. ప్రధాన జట్టులో చోటు కోల్పోయిన అక్షర్.. స్టాండ్‌ బై‌లో ప్లేయర్‌కు ఛాన్స్

India’s squad for ICC T20 World Cup: బుధవారం బీసీసీఐ ఎట్టకేలకు టీమిండియాలో ఎలాంటి భారీ మార్పులు లేకుండానే అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేవలం స్వ్కాడ్‌లోనే ఓకే ఒక్క మార్పు చేసింది.

ICC T20 World Cup: షాకిచ్చిన బీసీసీఐ.. ప్రధాన జట్టులో చోటు కోల్పోయిన అక్షర్.. స్టాండ్‌ బై‌లో ప్లేయర్‌కు ఛాన్స్
Axar Patel

Updated on: Oct 13, 2021 | 5:26 PM

India’s squad for ICC T20 World Cup: టీ 20 వరల్డ్ కప్ 2021 దుబాయ్‌లో అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. టీ 20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. అయితే, నేటి వరకు మార్పులకు అవకాశం ఉండడంతో ఎవరు ఉండనున్నారు.. ఎవరో తప్పుకోనున్నారో అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే బుధవారం బీసీసీఐ ఎట్టకేలకు టీమిండియాలో ఎలాంటి భారీ మార్పులు లేకుండానే అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేవలం ఓకే ఒక్క మార్పు చేసింది. ఇప్పటి వరకు ప్రధాన జట్టులో భాగమైన అక్షర్ పటేల్‌ను స్టాండ్ బైలో చేర్చింది. అలాగే స్టాండ్ బైగా ఉన్న శార్దుల్ ఠాకూర్‌ను మాత్రం ప్రధాన జట్టులో చేర్చింది. ఫుల్ ఫాంలో ఉన్న శిఖర్ ధావన్‌ను కూడా చేర్చకుండా అందరికీ షాక్ ఇచ్చింది. అలాగే యుజ్వేంద్ర చాహాల్ కూడా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

టీమ్ మేనేజ్‌మెంట్‌తో చర్చించిన తర్వాత భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ శార్దూల్ ఠాకూర్‌ను ప్రధాన జట్టులో చేర్చింది. 15 మంది సభ్యుల బృందంలో భాగమైన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇప్పుడు స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

ఐసీసీ టీ 20 ప్రపంచకప్ కోసం భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్ , శార్దుల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ

స్టాండ్-బై ప్లేయర్స్: శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్, ఆక్షర్ పటేల్

అలాగే అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లుక్మన్ మెరివాలా, వెంకటేశ్ అయ్యర్, కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కె. గౌతమ్‌లు టీమిండియా నెట్ సెషన్‌లో భాగం కానున్నారు.

Also Read: T20 World Cup: టీమిండియా స్వ్కాడ్‌లో చేరనున్న యంగ్ ప్లేయర్? హార్ధిక్ ఫిట్‌నెస్‌పై ఇంకా డౌటే.. మరో రెండు రోజుల్లో ఏం జరగనుంది..!

Virat Kohli: విరాట్ కోహ్లీ ఎప్పుడూ మంచి వ్యూహకర్త కాదు.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు