World Cup 2023 Live Streaming: ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఉచితంగా చూడండి ఇలా.. పూర్తి వివరాలు మీకోసం..

|

Oct 04, 2023 | 5:51 PM

ICC Cricket World Cup 2023 Live Streaming: 2023 వన్డే ప్రపంచ కప్ గురువారం, అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ టీంల మధ్య జరగనుంది. ఇకపోతే టీమిండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే, ప్రపంచ కప్ మ్యాచ్‌ల టెలికాస్ట్, ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

World Cup 2023 Live Streaming: ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఉచితంగా చూడండి ఇలా.. పూర్తి వివరాలు మీకోసం..
Icc World Cup 2023
Follow us on

ICC Cricket World Cup 2023 Live Streaming: ఐసీసీ వన్డే ప్రపంచ కప్, నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రపంచ కప్ నిర్వహించనున్నారు. రేపటి నుంచి అంటే అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి వరల్డ్ కప్ భారత్‌లో జరుగుతుండగా, చివరి మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. ప్రపంచకప్‌ తొలి, చివరి మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ చివరి వన్డే ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు మైదానంలో ప్రపంచ కప్ చూడటానికి వెళ్లకపోతే, ఇంటినుంచే టీవీ లేదా మొబైల్‌లో చూడొచ్చు. ప్రపంచ కప్‌లోని అన్ని మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ లేదా టెలికాస్ట్ ఎలా, ఎక్కడ చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

టీవీలో వరల్డ్ కప్ ఎలా చూడాలంటే?

మీరు మీ టీవీలో ఇంట్లో కూర్చొని ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూడాలనుకుంటే, స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌ని ట్యూన్ చేసుకోవాలి. ఈసారి, స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ ప్రపంచ కప్ ప్రసార హక్కులను దక్కించుకుంది. కాబట్టి, మీరు స్టార్ స్పోర్ట్స్ అన్ని ఛానెల్‌ల్లోనూ లైవ్‌ను వీక్షించవచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ హిందీ, స్టార్ స్పోర్ట్స్ మరాఠీ, అనేక ఇతర స్టార్ స్పోర్ట్స్‌తో సహా ఇతర భాషల ఛానళ్లను చూడొచ్చు. కానీ, మీరు ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూడగలరు.

మొబైల్‌లో ప్రపంచ కప్‌ను ఎలా చూడాలంటే?

మీరు ఎప్పుడైనా, ఇంట్లో లేదా బయట ఎక్కడైనా ప్రపంచ కప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడాలనుకుంటే, మీ ఫోన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తప్పనిసరిగా ఉండాలి. మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అన్ని ప్రపంచ కప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడగలరు. ఇందులో ఒక విశేషమేమిటంటే, ఈసారి మీరు వరల్డ్ కప్ మ్యాచ్‌లను చూడటానికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌ను మీ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, స్పోర్ట్స్ విభాగానికి వెళ్తే చాలు. అక్కడ మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అన్ని ప్రపంచ కప్ మ్యాచ్‌లను పూర్తి ఉచితంగా వీక్షించవచ్చు.

టీవీ9 వెబ్ సైట్‌లోనూ..

ఇది కాకుండా మీరు ప్రపంచ కప్ మ్యాచ్‌ల గురించి మరింత సమాచారాన్ని, మ్యాచ్‌ల లైవ్ బ్లాగ్, రికార్డులు, ఆసక్తికర కథనాలకు సంబంధించిన ఏవైనా గణాంకాలను తెలుసుకోవాలనుకుంటే మీరు ICC అధికారిక వెబ్‌సైట్, టీవీ9తెలుగు (https://tv9telugu.com/sports/cricket-news) వెబ్ సైట్ చూడొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..