గేలి చేస్తారా?..ఎలా ఉంది మా రో’హిట్’ సర్జికల్ స్ట్రయిక్

|

Jun 17, 2019 | 8:02 AM

వరల్డ్‌కప్ 2019లో భారత్‌ దుమ్మురేపింది. పాక్‌తో  జరిగిన ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో  విజయదు:దుభి మోగించింది. అయితే భారత అద్భుత విజయం వెనుక రోహిత్ శర్మ కీలక భూమిక పోషించారు. మాంచెస్టర్ వేదికగా భారత్ వైస్ కెప్టెన్  చెలరేగిపోయాడు. ‘ఫ్యాన్స్ హిట్ మ్యాన్’ గా పిలుచుకునే రోహిత్ ఆ పేరుకు న్యాయం చేసేలా.. ఫోర్లు, సిక్సులతో పాకిస్థానీ బౌలర్లను బెంబేలెత్తించాడు. బౌండరీలతో వర్షంతో విరుచుకుపడిన రోహిత్ శర్మ 85 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తం 14 ఫోర్లు, 3 సిక్సులు […]

గేలి చేస్తారా?..ఎలా ఉంది మా రోహిట్ సర్జికల్ స్ట్రయిక్
Follow us on

వరల్డ్‌కప్ 2019లో భారత్‌ దుమ్మురేపింది. పాక్‌తో  జరిగిన ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో  విజయదు:దుభి మోగించింది. అయితే భారత అద్భుత విజయం వెనుక రోహిత్ శర్మ కీలక భూమిక పోషించారు. మాంచెస్టర్ వేదికగా భారత్ వైస్ కెప్టెన్  చెలరేగిపోయాడు. ‘ఫ్యాన్స్ హిట్ మ్యాన్’ గా పిలుచుకునే రోహిత్ ఆ పేరుకు న్యాయం చేసేలా.. ఫోర్లు, సిక్సులతో పాకిస్థానీ బౌలర్లను బెంబేలెత్తించాడు. బౌండరీలతో వర్షంతో విరుచుకుపడిన రోహిత్ శర్మ 85 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తం 14 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి 140 పరుగులు చేశాడు. భారత్ భారీ స్కోర్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మపై సోషల్ మీడియాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రోహిత్‌ను వింగ్ కమాండర్ అభినందన్‌తో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేశాడంటూ అభినందన్ మీసం కట్టుతో రోహిత్ మార్పింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు.

కాగా, వింగ్ కమాండర్‌ అభిందన్‌ను కించపరుస్తూ ఓ పాకిస్తాన్ టీవీ ఛానల్ యాడ్‌ను ప్రసారం చేసింది. అంతేకాదు మాంచెస్టర్ స్టేడియంలోనూ అభినందన్‌ను అవమానించేలా బ్యానర్లు ప్రదర్శించారు పాకిస్తానీలు. దాంతో వారికి సోషల్ మీడియా వేదికగా గట్టిగా బుద్ధి చెబుతున్నారు భాతర అభిమానులు. పాకిస్తానీ ఫ్యాన్స్‌కు కౌంటర్‌గా రోహిత్ శర్మ సెంచరీ పోజులను వైరల్ చేస్తున్నారు.