
ఛాంపియన్స్ ట్రోఫీ మొదలై వారం అయింది. గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్.. ఇప్పటికే టోర్నీ నుంచి నాకౌట్ స్టేజిలోనే నిష్క్రమించింది. ఇక పాక్ తన లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడబోతోంది. ఈ రెండు జట్లు కూడా గ్రూప్ దశలో చెరో రెండు మ్యాచ్‌లు ఆడి.. రెండింట ఓటమిపాలయ్యాయి. ఇదే రెండు జట్లకు చివరి మ్యాచ్.. ఇక ఈ మ్యాచ్ ఫలితం పాకిస్తాన్ ప్రతిష్టకు సంబంధించినది. ఓడిపోతే ఆ జట్టు కోట్లాది రూపాయల నష్టాన్ని చవి చూసే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 27న రావల్పిండి స్టేడియంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తలపడనున్నాయి. రెండు జట్లు భారత్, న్యూజిలాండ్‌లతో ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయాయి. ఫలితంగా, రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించాయి. మరి నాకౌట్ స్టేజిలోని చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోతే ఏమవుతుంది.?
ఛాంపియన్స్ ట్రోఫీకి ఐసీసీ నిర్ణయించిన ప్రైజ్ మనీ ప్రకారం.. ఈ టోర్నమెంట్ గెలిచిన ఛాంపియన్ జట్టుకు రూ. 19.46 కోట్లు లభిస్తాయి. అదే విధంగా, రన్నరప్ జట్టుకు రూ. 9.73 కోట్లు.. సెమీఫైనలిస్ట్ జట్లకు రూ.4.86 కోట్లు వస్తాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన జట్లకు ఒక్కొక్కరికి రూ. 3.04 కోట్లు లభిస్తాయి. అలాగే ఏడు, ఎనిమిదో స్థానంలో నిలిచిన జట్లకు ఒక్కొక్కరికి రూ. 1.22 కోట్లు లభిస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించినందున, కచ్చితంగా గ్రూప్ స్టేజిలో చివరి స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే, ఆ జట్టు ఐదో లేదా ఆరో స్థానాన్ని దక్కించుకోవచ్చు. దీంతో పాకిస్తాన్ జట్టుకు ఐసీసీ రూ.3.04 కోట్ల ప్రైజ్ మనీని అందించనుంది. ఒకవేళ బంగ్లాదేశ్ పాకిస్థాన్‌ను ఓడిస్తే, పాకిస్తాన్ జట్టు ఏడో లేదా ఎనిమిదో స్థానానికి పడిపోతుంది. ఇది నిజమైతే, పాకిస్తాన్ ఖాతాలో రూ.1.22 కోట్లు మాత్రమే జమ అవుతాయి.
ఈ టోర్నమెంట్‌ను పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. కానీ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆ జట్టు ఓడిపోతే కోట్లాది రూపాయల నష్టాన్ని చవి చూడటం తప్పదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి