ICC Appoints BYJU’S : ప్రసార, డిజిటల్ హక్కులతోపాటు ఐసీసీ గ్లోబల్ పార్ట్నర్‌గా బైజూస్..

|

Feb 08, 2021 | 4:32 PM

ఐసీసీ కొత్త పార్టనర్‌ను ప్రకటించింది. రాబోయే మూడేళ్ల పాటు బైజూస్ తమ గ్లోబల్ పార్టనర్‌గా వ్యవహరిస్తుందని ఐసీసీ తెలిపింది. రానున్న మూడేళ్ల పాటు బైజూస్​ తమ ప్రపంచ భాగస్వామిగా..

ICC Appoints BYJUS : ప్రసార, డిజిటల్ హక్కులతోపాటు ఐసీసీ గ్లోబల్ పార్ట్నర్‌గా బైజూస్..
ICC appoints BYJU'S
Follow us on

ICC Appoints BYJU’S : ఐసీసీ కొత్త పార్టనర్‌ను ప్రకటించింది. రాబోయే మూడేళ్ల పాటు బైజూస్ తమ గ్లోబల్ పార్టనర్‌గా వ్యవహరిస్తుందని ఐసీసీ తెలిపింది. రానున్న మూడేళ్ల పాటు బైజూస్​ తమ ప్రపంచ భాగస్వామిగా కొనసాగుతుందని అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ICC) ప్రకటించింది. 2021 నుంచి 2023 వరకు ఈ ఒప్పందం కొనసాగుతుందని వెల్లడించింది.

భారత్‌ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌తోపాటు న్యూజిలాండ్‌లో జరగనున్న ఉమెన్స్ వరల్డ్ కప్‌‌ భాగస్వామిగా ఉంటుంది. అంతే కాకుండా ఐసీసీ పరిధిలో జరిగే అన్ని ఈవెంట్లకు బైజూస్ అధికారిక భాగస్వామిగా ఉంటుంది.దీనితోపాటు ప్రసార, డిజిటల్​హక్కులను బైజూస్ కలిగి ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. బెజూస్.. భారతదేశంలోని అతిపెద్ద టెక్నాలజీ ఆధారిత ఎడ్యుకేషన్​సంస్థ గుర్తింపు ఉంది.

2019 ఆగష్టు నుంచి టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్ బ్రాండింగ్ చేస్తోంది. ప్రపంచ అతిపెద్ద ఈవెంట్లను ఇది నిర్వహిస్తోంది. వినూత్న రీతిలో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది. టీమిండియా స్పాన్సర్లలో ఒకటైన బైజూస్​ సంస్థ స్థాపకులు, సీఈఓ బైజూ రవీంద్రన్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.  ఐసీసీ ప్రపంచ భాగస్వాముల్లో​ఒకటని చెప్పడానికి సంతోషిస్తున్నాము అని పేర్కొన్నారు. బైజూస్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా తెలిపారు.

క్రికెట్​ అనే ఆటలో పట్టుదల, నమ్మకం అనేవి చాలా ముఖ్యం అని వెల్లడించారు. చాలా మంది భారతీయ యువకులు క్రికెట్​ను అమితంగా ప్రేమిస్తారుని ఆయన అన్నారు. మా ఈ భాగస్వామ్యం ద్వారా అధిక మంది యువకుల హృదయాలను గెలవాలని కాంక్షిస్తున్నాము అంటూ బైజూ రవీంద్రన్​ తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

Jaguar Land Rover: భారత రహదారులపై దూసుకెళ్లనున్న ల్యాండ్ రోవర్ ఎలక్ట్రిక్ కారు.. కేవలం 4.8 సెకండ్లలో 100 కి.మీ వేగం..
నాపై అవిశ్వాస తీర్మానం పెడతారా ? నో ప్రాబ్లమ్ ! రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు మనస్తాపం