Ian Bishop Comments: ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన టీం ఇండియా యువ ఓపెనర్ పృథ్వీషా బ్యాటింగ్ శైలిపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీషా కొన్నాళ్లుగా భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడని, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో షార్ట్‌పిచ్ బంతులతో అతడిని బౌలర్లు పెవిలియన్‌కు పంపించారని ఎగతాళి చేశాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు ఇన్‌స్వింగర్లతో బోల్తా కొట్టించారన్నారు. పిచ్ అయిన బంతి ఆఫ్ వికెట్‌మీదకు దూసుకొస్తున్నప్పుడు ఆడటంలో షా విఫలమవుతున్నాడని ఆరోపించారు.
అందుకే అతడి స్థానంలో శుభ్‌మన్‌గిల్‌కు జట్టు యాజమాన్యం అవకాశం ఇచ్చిన సంగతిని గుర్తుచేశాడు. పృథ్వీషా వెంటనే తన బ్యాటింగ్ సాంకేతిక లోపాన్ని సవరించుకోవాలని కోరాడు. ఇందుకోసం ఎవరైనా నిపుణుడు లేదా క్రికెట్ గురువు సలహా తీసుకోవాలని పేర్కొన్నాడు. బ్యాటింగ్ లోపం సరిచేసేందుకు తానేమీ బ్యాటింగ్ సాంకేతిక నిపుణుడు లేదా గురువును కాదని అందుకు మరెందరో అర్హులైన ఆటగాళ్లు ఉన్నారని గుర్తుచేశాడు. అతడి లోపాన్ని సరిచేసేందుకు, బ్యాటింగ్ తుది మెరుగులు పెట్టేందుకు ఎవరైనా సాయపడాలని సూచించాడు.
క్రికెట్‌లో ఆ షాట్‌ను రద్దు చేయాలి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్