Virat Kohli: తొలిసారి మౌనం వీడిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదులుకోవడానికి కారణం అదేనంటూ వివరణ

Sourav Ganguly: టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న విరాట్ నిర్ణయాన్ని విన్న తరువాత తాను ఆశ్చర్యపోయానని సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు.

Virat Kohli: తొలిసారి మౌనం వీడిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదులుకోవడానికి కారణం అదేనంటూ వివరణ
Virat Kohli

Edited By: Anil kumar poka

Updated on: Oct 23, 2021 | 1:25 PM

Virat Kohli T20 Captaincy: వరల్డ్ కప్ తర్వాత టీ 20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎట్టకేలకు మౌనం వీడారు. ఇది తన సొంత నిర్ణయమని, బీసీసీఐ ఎలాంటి ఒత్తిడి చేయలేదని గంగూలీ చెప్పాడు. ఇండియా టుడేతో మాట్లాడిన గంగూలీ, టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలనుకున్న విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని విని తాను ఆశ్చర్యపోయానని గంగూలీ తెలిపారు. అయితే కోహ్లీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో అర్థమైందని పేర్కొన్నారు.

“నేను ఆశ్చర్యపోయాను. ఇంగ్లండ్ టూర్ తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకుని ఉండాలి. ఇది అతని నిర్ణయం. మా వైపు నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు. మేము కోహ్లీకి ఏమీ చెప్పలేదు” అని గంగూలీ అన్నారు. ‘గతంలో కెప్టెన్లు, తనతో సహా, ఒక నిర్దిష్ట సమయంలో అలసిపోయినట్లుగా అనిపించిందని, భారత్ వంటి దేశాన్ని మూడు ఫార్మాట్లలో ఇంతకాలం నడిపించడం చాలా కష్టమైన పని’ అని ఆయన అన్నారు.

“మేము అలాంటివి చేయం, ఎందుకంటే నేనూ ఒక ఆటగాడిని. కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. చాలా కాలం పాటు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉండటం చాలా కష్టం” అని గంగూలీ వెల్లడించారు. “నేను ఆరేళ్ల పాటు కెప్టెన్‌గా ఉన్నాను, బయటికి బాగానే ఉంది. గౌరవంతోపాటు అన్నీ ఉన్నాయి. కానీ, లోపల మాత్రం అలసట అనే భావనే ఉండేది. ఇది ఏ కెప్టెన్‌కైనా జరుగుతుంది. టెండూల్కర్, గంగూలీ లేదా ధోనీ లేదా కోహ్లీకి మాత్రమే కాదు. ఆ తర్వాత కూడా కెప్టెన్‌గా వస్తాడు, ఇది చాలా కష్టమైన పని” అని గంగూలీ పేర్కొన్నారు.

ముఖ్యంగా, సెప్టెంబర్‌లో విరాట్ కోహ్లీ ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచకప్ తర్వాత టీ 20 కెప్టెన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. తన సుదీర్ఘమైన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, కోహ్లీ వన్డే, టెస్ట్ జట్లకు పూర్తిగా నాయకత్వం వహించడానికి నాకు స్పేస్ కావాలి కాబట్టే పొట్టి పార్మాట్‌ నుంచి తప్పుకోవడానికి అసలు కారణం అని తెలిపాడు. రోహిత్ శర్మ, టీం మేనేజ్‌మెంట్, బీసీసీఐతో సుదీర్ఘ చర్చల తర్వాత తాను ఈ నిర్ణయం తీసుకున్నానని కోహ్లీ చెప్పాడు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ, టీ 20 ల్లో కెప్టెన్‌గా తన చివరి టీ20 ప్రపంచ కప్‌ 2021లో భారతదేశానికి ట్రోఫీ అందించాలని ఆరాటపడుతున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం అక్టోబర్ 24న జగరనున్న మ్యాచుతో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

Also Read: ENG vs WI T20 World Cup 2021 Match Prediction: ఇంగ్లండ్‌పై విండీస్ ఘనమైన రికార్డు కొనసాగేనా..? రికార్డులు ఎలా ఉన్నాయంటే..!

Viral Photos: ఇలాంటి బౌలింగ్ ఎప్పుడైనా చూశారా..? ట్విట్టర్లో మంటలు పుట్టిస్తోన్న మెంటార్ సింగ్ ధోని ఫొటోలు..!