Ram Siya Ram: నేను రాముడు, హనుమంతుడి భక్తుడిని: దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్

Keshav Maharaj On Ram Siya Ram: కేశవ్ మహారాజ్ దక్షిణాఫ్రికా గొప్ప స్పిన్నర్లలో ఒకడిగా పేరుగాంచాడు. కేశవ్ మహరాజ్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2016లో ఆస్ట్రేలియాతో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు 50 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇక్కడ అతను 32 బౌలింగ్ సగటుతో 158 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాలో ఒక స్పిన్నర్‌కి ఇది చాలా పెద్ద ఫిగర్. ఎందుకంటే, దక్షిణాఫ్రికాలోని పిచ్‌లు ఎప్పుడూ స్పిన్నర్లకు పెద్దగా సహకరించలేదు. మహరాజ్ వన్డే క్రికెట్‌లో 55 వికెట్లు కూడా తీశాడు.

Ram Siya Ram: నేను రాముడు, హనుమంతుడి భక్తుడిని: దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్
Keshav Maharaj

Updated on: Jan 09, 2024 | 6:15 PM

Keshav Maharaj On Ram Siya Ram: దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ హోమ్ గ్రౌండ్‌లో బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడల్లా లేదా బౌలింగ్ చేస్తున్నప్పుడు వికెట్ తీసుకున్నప్పుడల్లా, స్టేడియంలో ‘రామ్ సియా రామ్’ పాట ప్లే అవుతుంది. ముఖ్యంగా భారత్‌, దక్షిణాఫ్రికా పర్యటనలో ఇది చాలా సందర్భాలలో కనిపించింది. వన్డే సిరీస్ సమయంలోనూ ఒకసారి కేఎల్ రాహుల్ కూడా దీనికి సంబంధించి కేశవ్ మహారాజ్‌ని ఒక ప్రశ్న అడిగాడు. కేశవ్ భాయ్, మీరు వచ్చినప్పుడల్లా రామ్ సియా రామ్ పాటను ప్లే చేస్తారా? అని అడిగాడు. దీనికి వెటరన్ స్పిన్నర్ ‘అవును’ అంటూ సమాధానమిచ్చాడు.

టెస్టు సిరీస్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. కేప్ టౌన్ టెస్ట్‌లో, కేశవ్ మహారాజ్ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు, స్టేడియంలో రామ్ సియా రామ్ పాట ప్రతిధ్వనించడం ప్రారంభించింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ కేశవ్ మహారాజ్ వైపు చేతులు చూపిస్తూ.. ఆపై విల్లు నుంచి బాణం సంధించేలా భంగిమతో ఆకట్టుకున్నాడు. విరాట్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘రామ్ సియా రామ్’ పాటతో కేశవ్ మహరాజ్‌కి గల సంబంధం..

ఈ క్రమంలో ‘రామ్ సియా రామ్’ పాటతో కేశవ్ మహరాజ్‌కి గల సంబంధం గురించి ఎట్టకేలకు సమాధానం వచ్చింది. కేశవ్ మహరాజ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇది నా ప్రవేశ గీతం. నేను రాముడు, హనుమంతుని భక్తుడిని. కాబట్టి, ఇది నాకు సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నాను’ అంటూ వివరించాడు.

కేశవ్ మాట్లాడుతూ, ‘నేను చాలాసార్లు ఎదురుగా నిలబడి ఈ పాటను ప్లే చేయమని అడిగాను. నాకు, నా దేవుడే అతిపెద్ద ఆశీర్వాదం. అతను నాకు దారి చూపిస్తాడు. నాకు అవకాశాలు ఇస్తాడు. కాబట్టి నేను చేయగలిగినది ఇదే. మతాన్ని, సంస్కృతిని గౌరవించడం ముఖ్యం. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘రామ్‌ సియారామ్‌’ ప్లే చేయడం నాకు చాలా ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు.

దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్లలో ఒకడిగా..

కేశవ్ మహారాజ్ దక్షిణాఫ్రికా గొప్ప స్పిన్నర్లలో ఒకడిగా పేరుగాంచాడు. కేశవ్ మహరాజ్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2016లో ఆస్ట్రేలియాతో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు 50 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇక్కడ అతను 32 బౌలింగ్ సగటుతో 158 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాలో ఒక స్పిన్నర్‌కి ఇది చాలా పెద్ద ఫిగర్. ఎందుకంటే, దక్షిణాఫ్రికాలోని పిచ్‌లు ఎప్పుడూ స్పిన్నర్లకు పెద్దగా సహకరించలేదు. మహరాజ్ వన్డే క్రికెట్‌లో 55 వికెట్లు కూడా తీశాడు. అతను టీ20ల్లో చాలా అరుదుగా కనిపించాడు. అంతర్జాతీయ టీ20లో 27 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..