IPL 2023 Prize Money: విన్నర్ నుంచి రన్నర్ వరకు.. ఐపీఎల్ ప్రైజ్ మనీ పూర్తి వివరాలు మీకోసం..

|

May 27, 2023 | 4:37 PM

IPL 2023 Prize Money: మొదటి రెండు ఎడిషన్లలో, విజేత జట్టుకు రూ. 4.8 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ. 2.4 కోట్లు అందించారు. కాగా, ప్రస్తుతం ఈ ప్రైజ్ మనీ 5 రెట్లు పెరిగింది.

IPL 2023 Prize Money: విన్నర్ నుంచి రన్నర్ వరకు.. ఐపీఎల్ ప్రైజ్ మనీ పూర్తి వివరాలు మీకోసం..
Ipl 2023 Prize Money
Follow us on

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టుపై గుజరాత్ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఇక ట్రోఫీ మ్యాచ్‌లో చెన్నై జట్టుతో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో(Narendra Modi Stadium in Ahmedabad) రేపు అంటే మార్చి 28న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు చెన్నై (Chennai Super Kings vs Gujarat Titans)తో తలపడనుంది. అందుకే, ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. దీంతో పాటు విజేతలుగా నిలిచిన ఆటగాళ్లకు ఎంత ప్రైజ్ మనీ (IPL 2023 Prize Money) అందజేయనున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ ఎడిషన్ ఛాంపియన్, రన్నర్-అప్‌తో మిగతా జట్లకు, ప్లేయర్లకు కూడా అవార్డులు ఇవ్వనున్నారు. ఈ మిలియన్ డాలర్ల టోర్నమెంట్‌లో మొదటి రెండు ఎడిషన్‌లలో విజేత జట్టుకు రూ.4.8 కోట్లు ఇవ్వగా, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.2.4 కోట్లు అందించారు. ఇక గత సీజన్ ఐపీఎల్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఏకంగా రూ.20 కోట్ల బహుమతి లభించింది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌కు రూ.13 కోట్లు లభించాయి. ఇక ఈ ఎడిషన్‌కి వస్తే గత ఎడిషన్‌ అందించిన ప్రైజ్ మనీనే బహుమతిగా ఇవ్వనున్నారు.

ఈ ఏడాది ఐపీఎల్ ప్రైజ్ మనీగా దాదాపు రూ.46.5 కోట్లు కేటాయించారు. పైన చెప్పినట్లుగా రేపటి మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు రూ.20 కోట్లు ఇవ్వనున్నారు. ఫైనల్‌లో ఓడిన జట్టుకు రూ.13 కోట్లు దక్కనుంది. అలాగే ఈ రెండు జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్, నాలుగో స్థానంలో నిలిచిన లక్నో సూపర్‌జెయింట్‌లు కూడా భారీ మొత్తాన్ని బహుమతిగా అందుకోనున్నాయి. దీంతో పాటు ఇతర అవార్డులు సాధించిన క్రీడాకారులకు కూడా లక్షా రూ. ప్రతిఫలం ఉంటుంది. ఏ అవార్డుకు ఎంత డబ్బు ఇస్తారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎవరికి ఎంత డబ్బు వస్తుందంటే?

• విజేత జట్టు- రూ. 20 కోట్లు

ఇవి కూడా చదవండి

• రన్నరప్ జట్టు- రూ. 13 కోట్లు

• మూడో స్థానంలో ఉన్న జట్టు (ముంబై ఇండియన్స్)- రూ. 7 కోట్లు

• నాల్గవ స్థానంలో ఉన్న జట్టు (లక్నో సూపర్ జెయింట్స్)- రూ. 6.5 కోట్లు

• ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్- రూ. 20 లక్షలు

• సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్- రూ. 15 లక్షలు

• ఆరెంజ్ క్యాప్ హోల్డర్- రూ. 15 లక్షలు (అత్యధిక పరుగులు)

• పర్పుల్ క్యాప్ హోల్డర్ – రూ. 15 లక్షలు (అత్యధిక వికెట్లు)

• సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడు- రూ. 12 లక్షలు

• అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడికి – రూ. 12 లక్షలు.

• సీజన్ గేమ్ ఛేంజర్ కోసం- రూ. 12 లక్షలు

ఇక ఈ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లను పరిశీలిస్తే..

• శుభమన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) – 851 పరుగులు

• ఫాఫ్ డు ప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)- 730 పరుగులు

• విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)- 639 పరుగులు

• డెవాన్ కాన్వే (చెన్నై సూపర్ కింగ్స్)- 625 పరుగులు

• యస్సవి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్)- 625 పరుగులు

అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు..

• మహ్మద్ షమీ (గుజరాత్ టైటాన్స్)- 28 వికెట్లు

• రషీద్ ఖాన్ (గుజరాత్ టైటాన్స్)- 27 వికెట్లు

• మోహిత్ శర్మ (గుజరాత్ టైటాన్స్)- 24 వికెట్లు

• పీయూష్ చావ్లా (ముంబై ఇండియన్స్) – 22 వికెట్లు

• యుజ్వేంద్ర చాహల్ (రాజస్థాన్ రాయల్స్) 21 వికెట్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..